దిశా పటానీ కుటుంబానికి అండగా సీఎం యోగి

Published on Tue, 09/16/2025 - 10:56

బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటానీ కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి బరోసా కల్పించారు. కొద్దిరోజుల క్రితం బరేలీలోని ఆమె నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు  కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ఆమె కుటుంబం ఆందోళనలో ఉంది. ఈ విషయం గురించి దిశా తండ్రికి ముఖ్యమంత్రి ఫోన్‌ చేశారు. కాల్పులు జరిపిన వారిని తప్పుకుండా పట్టుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని మీడియాతో దిశా పటానీ తండ్రి జగదీశ్‌ తెలిపారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఫోన్‌ సంభాషణ గురించి ఇలా చెప్పారు. ' మా కుటుంబానికి సీఎం ధైర్యాన్నిచ్చారు. మాకు పూర్తి భద్రత కల్పిస్తామని ఫోన్‌లో చెప్పారు. కాల్పులు జరిపిన వారు అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నా సరే పట్టుకుని తీరుతామన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా అండగా ఉంటారని ఆయన అన్నారు. మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.' అని ఆయన అన్నారు.

దిశా పటానీ తండ్రి రిటైర్డ్‌ డీఎస్పీ
దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఈ కాల్పులు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు . దిశా పటానీ సోదరి ఖుష్బూ మాజీ ఆర్మీ అధికారిణి అనే విషయం తెలిసిందే. దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీ ఒక రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP). ఆయన ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో సేవలందించారు. చివరి పోస్టింగ్ బరేలీలో జరిగింది. జగదీశ్ పటానీ నిజాయితీ గల పోలీస్ అధికారిగా గుర్తింపు ఉంది. రిటైర్మెంట్ తర్వాత కూడా సామాజిక సేవ, వ్యవసాయం వంటి రంగాల్లో చురుకుగా ఉన్నారు.

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)