Breaking News

సమంత, విజయ్‌ల ఎమోషన్స్‌ ‘ఖుషి’కి బ్యూటీని తీసుకొచ్చాయి

Published on Wed, 08/23/2023 - 18:09

ప్రేమ గురించి కొన్ని కలలు కనే యువకుడికి లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని తెలిసిరావడమే ‘ఖుషి’ సినిమా నేపథ్యం. మణిరత్నం సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చూపించే విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో చూస్తారు. అయితే అలాంటి సీన్స్ ను మేము కాపీ కొట్టలేదు. అలాంటి ఫీల్ కలిగించేలా విజువల్స్ ఉంటాయి’అని  సినిమాటోగ్రాఫర్ జి.మురళి అన్నారు. విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జి.మురళి సినిమాటోగ్రఫీ అందించాడు. సెప్టెంబర్‌ 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మురళీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

► నేను 2005 నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను. అందాల రాక్షసి మూవీకి పనిచేశాను. ఆ తర్వాత నేను చేసిన లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఖుషి’నే. మైత్రీ రవి గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. ఈ సినిమాకు మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి సినిమాల మీద ఉన్నంత ప్యాషన్ నేను ఇంకో ప్రొడక్షన్ లోనూ చూడలేదు. సినిమా బాగా వచ్చేందుకు ఏది కావాలన్నా సమకూర్చుతారు. ఫిలిం మేకింగ్ లో వాళ్లు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. 

► మైత్రీ రవి గారు ఫోన్ చేసి చెన్నైకి డైరెక్టర్ తో కలిసి వస్తున్నాం. మీరు కథ వినండి అని చెప్పారు. అలా శివ గారు కథ చెప్పారు బాగా నచ్చింది. ఆయన ప్రీవియస్ మూవీస్ గురించి తెలుసుకున్నా. అలాంటి మంచి డైరెక్టర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యా.

► లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘ఖుషి’ ఉంటుంది. ఇందులో విప్లవ్, ఆరాధ్య క్యారెక్టర్ లలో విజయ్, సమంత నటన మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వాళ్ల క్యారెక్టర్స్ మధ్య వచ్చే సందర్భాల్లో విజయ్, సమంత చూపించిన ఎమోషన్స్, డీటెయిల్స్ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చాయి. క్యారెక్టర్ లో ఎంతవరకు నటించాలో విజయ్ కు బాగా తెలుసు. ‘ఖుషి’లో అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. ఈ సినిమాతో తొలిసారి సమంతతో కలిసి పనిచేశాను.

► దర్శకుడు శివ నిర్వాణ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. సినిమా మేకింగ్ మీద ఇష్టం ఉన్న దర్శకుడు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ఆయన మ్యూజిక్ సెన్స్ సూపర్బ్. ఇవాళ ‘ఖుషి’లో ఇంతమంచి మ్యూజిక్ వచ్చిందంటే దానికి శివ నిర్వాణ మ్యూజిక్ టేస్ట్ కారణం.

► నేను పనిచేసిన గత చిత్రాలు కాలా, సార్పట్ట వంటివి చూస్తే రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. కానీ ‘ఖుషి’లో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ విజువల్స్ తెరపైకి తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఫుల్ లైఫ్ తెరపై చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూడటం పూర్తయ్యాక మీకొక కొత్త అనుభూతి కలుగుతుంది. కెమెరా ద్వారా ఆ ఎమోషన్ తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)