Breaking News

తల్లిదండ్రుల కల ఒకటి … తన కల మాత్రం మరొకటి!

Published on Tue, 11/03/2026 - 22:51

పుట్టిన క్షణం నుంచే తమ కుమారుడిని ఒక గొప్ప దర్శకుడిగా చూడాలని కలలు కన్న తల్లిదండ్రులకు, ఊహించని విధంగా కెమెరానే తన ప్రపంచంగా ఎంచుకున్నాడు. తనకేం కావాలో తన లక్ష్యం ఏమిటో స్వయంగా నిర్ణయించుకున్న యువకుడు భువన్ విక్రమాదిత్య కొట్టాల. తనకు మూడేళ్ల వయసులోనే రుణం చిత్రంతో పాటు మరికొన్ని లఘు చిత్రాల్లో నటించాడు. అలా కెమెరా ముందుకు వచ్చిన భువన్.. ఐదేళ్ల వయసు నుంచే కెమెరాతో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. చిన్ననాటి ఆ ఆసక్తే క్రమంగా అభిరుచిగా, ఆ అభిరుచే లక్ష్యంగా మారి నేడు ఆయనను సినిమాటోగ్రాఫర్ స్థాయికి తీసుకొచ్చింది.

తల్లిదండ్రులు తనను దర్శకుడిగా చూడాలని ఆశించినప్పటికీ, తనకు నిజమైన ఆనందం కెమెరా వెనుకే ఉందని గుర్తించిన భువన్, సినిమాటోగ్రఫీని తన వృత్తిగా ఎంచుకున్నారు. చిన్న వయసులోనే ఫ్రేమింగ్, లైటింగ్, కెమెరా యాంగిల్స్, విజువల్ స్టోరీటెల్లింగ్ వంటి అంశాలపై ఆసక్తి పెంచుకుంటూ తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే పూర్తిస్థాయి చలనచిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆయన సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.

సహజంగా తనకున్న సృజనాత్మక నైపుణ్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, సినిమాటోగ్రఫీలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో, భారతదేశంలోని ప్రముఖ సినీ విద్యాసంస్థల్లో ఒకటైన చెన్నైలోని ఎల్‌వీ ప్రసాద్ కాలేజ్ ఆఫ్ మీడియా స్టడీస్‌లో చేరారు. అక్కడ సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఆధునిక సాంకేతిక అంశాలను అభ్యసిస్తూ.. తన అనుభవానికి వృత్తిపరమైన శిక్షణను జోడించుకుంటున్నారు. సహజ ప్రతిభకు సాంకేతిక నైపుణ్యం తోడైతే సృజనాత్మకతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయనే ఆలోచనతో తన సినీ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

వెంకటలక్ష్మితో యాడాది కిందట అనే సైకలాజికల్ సస్పెన్స్ మ్యూజికల్ లవ్ థ్రిల్లర్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. దర్శకుడిని చేయాలనుకున్న తల్లిదండ్రుల కల నుంచి… తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటోగ్రఫీ ప్రపంచాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యం వరకు సాగిన భువన్ ప్రయాణం సాగింది. చిన్న వయసులోనే తన అభిరుచిని గుర్తించి ముందుకు సాగాలనుకునే యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)