Breaking News

విషాదం.. ‘సీఐడీ’ సిరీస్‌ డైరెక్టర్‌ కన్నుమూత

Published on Tue, 10/27/2026 - 16:44

సాక్షి, ముంబై: చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్‌ ‘సీఐడీ’ (CID) సృష్టికర్త, దర్శకుడు, నిర్మాత బ్రిజేంద్రపాల్ సింగ్ (77) కన్నుమూశారు. బి.పి. సింగ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను ప్రముఖ దర్శకుడు అశోక్ పండిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన మృతితో టెలివిజన్ పరిశ్రమలో విషాదం నెలకొంది.

బ్రిజేంద్రపాల్ సింగ్ భారత టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రూపొందించిన ‘సీఐడీ’ సిరీస్ ఆయనకు విశేషమైన పేరును తీసుకొచ్చింది. 1998లో ప్రారంభమైన ఈ సిరీస్‌లో నేర పరిశోధనలు, ఉత్కంఠభరితమైన కథనాలు, అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సిరీస్‌లోని ఏసీపీ ప్రద్యుమ్న, దయా, అభిజీత్ వంటి పాత్రలు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాయి. ఎన్నో ఏళ్లపాటు కొనసాగిన ఈ కార్యక్రమం భారత టెలివిజన్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రసారమైన క్రైమ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించడంతో పాటు, బి.పి. సింగ్ అప్పుడప్పుడు డీసీపీ శంషేర్ సింగ్ చిత్రోలే పాత్రలోనూ కనిపించారు.

క్రైమ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా హారర్ కథలతోనూ బి.పి. సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన రూపొందించిన ‘ఆహట్’ హారర్ సిరీస్ 1995 నుంచి 2015 వరకు వివిధ దశల్లో ప్రసారమైంది. భయానక ఘటనలు, ఉత్కంఠభరితమైన కథనాలతో ఈ కార్యక్రమం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆదరణ సంపాదించుకుంది.

‘సీఐడీ’, ‘ఆహట్’ వంటి కార్యక్రమాల ద్వారా క్రైమ్, థ్రిల్లర్, హారర్ జానర్లలో భారత టెలివిజన్‌కు ఆయన విశేషమైన సేవలందించారు. టెలివిజన్ ప్రేక్షకులకు ఎన్నో ఏళ్లపాటు వినోదాన్ని అందించిన ఆయన, తన సృజనాత్మకతతో ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన మరణం భారత టెలివిజన్ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)