Breaking News

OTT: ‘చట్నీ సాంబార్‌’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ

Published on Sat, 08/17/2024 - 16:13

టైటిల్‌: ‘చట్నీ సాంబార్‌’ వెబ్‌ సిరీస్‌
నటీనటులు: యోగిబాబు, వాణి భోజన్, చంద్రన్, నితిన్ సత్య, దీపా శంకర్, తదితరులు
దర్శకత్వం: రాధామోహన్‌
ఓటీటీ: హాట్‌ స్టార్‌

వేడుకేదైనా, వేదికేదైనా, సందర్భం ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా మనిషికి ఎప్పటికీ తృప్తినిచ్చేది రుచికరమైన వంటలు. లేచీ లేవగానే కాఫీ టీ ల దగ్గర నుండి రాత్రి పడుకోబోయేముందు డెజర్ట్ వరకు మనం తినే ప్రతి పదార్ధానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది మరి. తినే పదార్థాల మార్కెట్ అన్ని రంగాలలో విరివిగా వుంది.  ఆ కోవలేనే హాట్ స్టార్ వేదికగా ఇటీవల ఓ సిరీస్ విడుదలైంది. దాని పేరే చట్నీ సాంబార్. మనం రోజూ విరివిగా వాడే పదాలు ఇవి. చట్నీ సాంబార్ రుచిలో ఎంత బాగుంటాయో ఈ సిరీస్ కూడా అదే విధంగా ఉంటుంది.

ప్రముఖ దర్శకులు రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వర్ధమాన తమిళ హాస్య నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో నటించాడు. ఇక కధాంశానికొస్తే రత్నసామి అనే వ్యక్తి ఊటీలో అముదా కేఫ్‌ను నడుపుతుంటాడు , ఈ కేఫ్ లో సాంబార్ చాలా ఫేమస్.  ఒకరోజు రత్నసామి తీవ్రఅనారోగ్యానికి గురవుతాడు. 

మరణశయ్యపై, అతను తన తల్లిని వివాహం చేసుకునే ముందు అముద అనే మహిళతో నివసించాడని మరియు ఆమె ద్వారా తనకు ఒక కొడుకు ఉన్నాడని తన కొడుకు కార్తీక్‌కు వెల్లడిస్తాడు. కార్తీక్ నుండి తన సవతి సోదరుడిని కలుస్తానని వాగ్దానం పొందిన తరువాత, రత్నసామి మరణిస్తాడు. కార్తీక్ సవతి సోదరుడు సచిన్‌. చెన్నై నగరంలో సచిన్ ఓ దోసెలబండి నడుపుతుంటాడు. 

అతని దగ్గర చట్నీ ఫేమస్. కార్తీక్ సచిన్ ను  కనుగొని, అతనిని ఊటీకి రత్నసామి అంత్యక్రియలు జరపడానకి తీసుకువస్తాడు.  ఇంట్లో ఉన్న ఎవరికీ సచిన్ నచ్చడు. మరి ఇంట్లో వారినందరినీ మెప్పించి సచిన్ వచ్చిన పని నెరవేర్చాడా? ఈ దశలో కార్తీక్ మరియు సచిన్ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కున్నారన్న విషయం ఇడ్లీ లేదా దోశలు తింటూ ఈ చట్నీ సాంబార్ ను హాట్ స్టార్ లో చూశేయండి. మంచి కామెడీ ఎంటర్ టైనర్ ఈ చట్నీ సాంబార్.
-ఇంటూరు హరికృష్ణ

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)