Breaking News

రూ.2 వేల కోట్ల బడ్జెట్‌.. రూ.5 లక్షలకు కక్కుర్తి?

Published on Sun, 08/02/2026 - 00:35

ప్రపంచ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ భారీ విజయాన్ని అందుకుంటోంది. వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ, హాలీవుడ్‌లో మరో సంచలన ప్రాజెక్ట్‌గా నిలిచింది. భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్, చారిత్రక నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు ఓ చిన్న మొత్తానికి సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచింది.

సినిమా చిత్రీకరణ కోసం ఉపయోగించిన ఓ వైకింగ్ నౌకకు జరిగిన నష్టానికి సంబంధించి 6,000 డాలర్లు (సుమారు రూ.5.2 లక్షలు) చెల్లించలేదని నౌక యజమానులు ఆరోపిస్తున్నారు. దీంతో "రూ.2 వేల కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసిన సంస్థ.. రూ.5 లక్షల బిల్లు విషయంలో ఎందుకు వివాదంలో పడింది?" అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ఆరు నెలల షూటింగ్.. దెబ్బతిన్న వైకింగ్ నౌక

‘ది ఒడిస్సీ’ చిత్రీకరణలో భాగంగా వైకింగ్ కాలానికి చెందిన ఓ నౌక ప్రతిరూపాన్ని ఉపయోగించారు. ఈ నౌకను దాదాపు ఆరు నెలల పాటు గ్రీస్, ఇటలీ తీర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌లో వినియోగించినట్లు సమాచారం. షూటింగ్ పూర్తయిన తర్వాత నౌక వెనుక భాగం, మస్తు వంటి కీలక భాగాలు దెబ్బతిన్నాయని దాని యజమానులు తెలిపారు. నౌక యజమానుల ప్రకారం.. చిత్రీకరణకు ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం నష్టం జరిగితే మరమ్మతుల ఖర్చును నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంది. దీంతో నౌకకు అవసరమైన మరమ్మతులు చేసి, వాటికి సంబంధించిన సుమారు 6,000 డాలర్ల బిల్లును పంపించినట్లు తెలిపారు.

s

చిన్న మొత్తం.. పెద్ద వివాదం

నౌక యజమానులు చెబుతున్న ప్రకారం, ఈ మొత్తం హాలీవుడ్ స్థాయి నిర్మాణ సంస్థకు పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ చారిత్రక వారసత్వ వస్తువులను సంరక్షించే తమలాంటి సంస్థలకు ఇది ముఖ్యమైన ఖర్చు అని పేర్కొన్నారు. సినిమా కోసం నౌకను అందించడం గర్వంగా ఉన్నప్పటికీ, నష్టం పరిహారం విషయంలో సమస్య ఎదురవడం బాధ కలిగించిందని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై చర్చ మొదలైంది. వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా నిర్మాణంలో కేవలం కొన్ని లక్షల రూపాయల బిల్లు వివాదంగా మారడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

యూనివర్సల్ స్టూడియోస్ వివరణ

అయితే ఈ ఆరోపణలను యూనివర్సల్ స్టూడియోస్ అంగీకరించలేదు. తమ రికార్డుల ప్రకారం నౌకకు సంబంధించిన అవసరమైన చెల్లింపులు పూర్తయ్యాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఏదైనా అపార్థం లేదా పెండింగ్ అంశం ఉంటే సంబంధిత వర్గాలతో చర్చించి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు సమాచారం. అందువల్ల ఇది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమా? లేక చెల్లింపుల ప్రక్రియలో ఏర్పడిన సమస్యా? అన్నది ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’ హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపొందించారు. ట్రోజన్ యుద్ధం తర్వాత తన స్వస్థలం ఇథాకాకు చేరేందుకు వీరుడు ఒడిస్సియస్ చేసే సాహస ప్రయాణమే ఈ కథకు ప్రధాన నేపథ్యం. ఈ చిత్రంలో మ్యాట్ డేమన్ ఒడిస్సియస్ పాత్రలో నటించగా, టామ్ హాలండ్, యాన్ హాథవే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. నోలన్ దర్శకత్వ శైలి, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Videos

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)