Breaking News

జాతర పాటను బాధ్యతగా భావించాను: నృత్యదర్శకుడు విజయ్‌ పోలాకి

Published on Sun, 12/22/2024 - 00:15

‘‘అల్లు అర్జున్‌గారి ‘పుష్ప 2’ సినిమాలోని జాతర సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయడాన్ని ఒత్తిడిగా ఫీలవ్వలేదు. బాధ్యతగా ఫీలయ్యాను. ఈ సినిమాలోని ‘జాతర’ పాటకు, పుష్ప 2 టైటిల్‌ సాంగ్‌కు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు కొరియోగ్రాఫర్‌ విజయ్‌ పోలాకి. ‘అమ్మాడి...’ (నాని ‘హాయ్‌ నాన్న’), ‘మార్‌ ముంత చోడ్‌ చింత...’ (రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’), ‘లింగిడి లింగిడి...’ (శ్రీకాంత్‌ ‘కోట బొమ్మాళి’), ‘నక్కిలిసు గొలుసు...’ (‘పలాస’), ‘కళ్ల జోడు కాలేజ్‌ పాప...’ (‘మ్యాడ్‌’) పాటలకు కొరియోగ్రఫీ చేసిన విజయ్‌ పోలాకి  ‘పుష్ప 2’ చిత్రంలోని జాతర పాట, టైటిల్‌ సాంగ్‌ ‘పుష్ప పుష్ప’లకు నృత్యరీతులు సమకూర్చారు.

ఈ నేపథ్యంలో విజయ్‌ పోలాకి మాట్లాడుతూ– ‘‘నేను కోరియోగ్రఫీ చేసిన మొదటి సాంగ్‌ సంపూర్ణేష్‌ బాబు ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని ‘అఆఇఈ...’. ఆ తర్వాత చాలా హిట్‌ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశాను. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలోని ‘ఊ అంటావా..’ పాట కోసం గణేష్‌ ఆచార్య మాస్టర్‌గారితో కలిసి వర్క్‌ చేశాను. అయితే ‘పుష్ప 2’లో నాకు కొరియోగ్రాఫర్‌గా చాన్స్‌ వస్తుందని అప్పుడు ఊహించలేదు. ‘పుష్ప 2’లోని ‘గంగమ్మ తల్లి...’ జాతర పాట, ‘పుష్ప... పుష్ప...’ పాటకు వర్క్‌ చేశాను. జాతర పాట రొటీన్‌గా ఉండకూడదని సుకుమార్‌గారు చె΄్పారు.

 ఇలా ఉండాలి అంటూ... కొన్ని మూమెంట్స్‌ ఆయన చూపించారు. పుష్పరాజ్‌ క్యారెక్టర్‌ని అర్థం చేసుకుని ఈ పాట చేయాలనుకున్నాను. అందుకని ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ని చాలాసార్లు చూశాను. జాతర సాంగ్‌కి మూడు నెలలు ప్రిపేర్‌ అయ్యి, 20 రోజులు షూట్‌ చేశాం. అల్లు అర్జున్‌గారు చాలా కష్టపడి చేశారు. ప్రస్తుతం సాయితేజ్‌గారి ‘సంబరాల ఏటిగట్టు’, రామ్‌ గారి సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్‌గారి ‘భైరవం’, ‘మ్యాడ్‌ 2’ (సింగిల్‌ కార్డు), హిందీలో ‘బేబీ’ సినిమాలకు వర్క్‌ చేస్తున్నాను’’ అన్నారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)