Breaking News

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పటివరకు రిహార్సల్స్‌కు రాలేదు: శేఖర్‌ మాస్టర్‌

Published on Tue, 05/03/2022 - 19:55

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా నుంచి ఇటీవల రిలీజైన ట్రైలర్‌ 24 గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్‌ను క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది.

ఇక కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్.. ప్రేక్షకులని అమితంగా అలరించాయి. ముఖ్యంగా కళావతి పాట 150 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పాటలో మహేష్ బాబు వేసిన సిగ్నేచర్ స్టెప్స్‌కు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి రీల్స్ సందడి చేశాయి. మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్‌ కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు. కళావతి, పెన్నీ పాటలతో పాటు సర్కారువారి పాట నుంచి రాబోయే మాస్ సాంగ్ విశేషాలు ఇలా పంచుకున్నారు...       

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు ? బుల్లితెర, వెండితెరని అలరిస్తున్నారు. మీ సీక్రెట్ ఏమిటి ?
సీక్రెట్ ఏం లేదండీ. ఇచ్చిన పని చక్కగా చేయడమే. నా దృష్టి వెండితెరపైనే వుంది. ఐతే నెలకు రెండు రోజులు టీవీ షూటింగ్ కి సమయం కేటాయించా. 

సర్కారు వారి పాటలో ఎన్ని పాటలు చేశారు ? 
మూడు. కళావతి, పెన్నీ, ఇంకో మాస్ సాంగ్. కళావతి, పెన్నీ ఇప్పటికే విజయాలు సాధించాయి. రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. 

ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నపుడు ఒత్తిడి వుంటుందా ? 
ఒత్తిడి వుండదు. ఒక సాంగ్ కి మించిన సాంగ్ ఇవ్వాలనే పట్టుదల వుంటుంది, దాని కోసమే కష్టపడి పని చేస్తాం. సరిలేరు నికెవ్వరులో మైండ్ బ్లాక్ పాట సూపర్ హిట్. దానికంటే గొప్ప పాట ఇవ్వడానికి ప్రయత్నించాం. పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. 

మహేశ్‌ గారితో మీ కాంబినేషన్ ?
మహేశ్‌బాబు గారితో సరిలేరు నికెవ్వరులో డ్యాంగ్ డ్యాంగ్, మైండ్ బ్లాక్, సర్కారు వారి పాటలో మూడు సాంగ్స్. మహేశ్‌బాబు చాలా త్వరగా నేర్చుకుంటారు. మహేష్ బాబుగారిలో అద్భుతమైన రిధమ్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకుంటే చాలు.

కళావతి పాటని అందరూ రీల్స్ చేశారు. మహేష్, సితార ల్లో ఎవరు బాగా చేశారు ? ఒక కోరియోగ్రఫర్ గా చెప్పండి? 
మహేష్-సితార ఇద్దరూ బాగా చేశారు. సితార పాపలో గొప్ప గ్రేస్ వుంది. ఐతే పెన్నీ ప్రమోషనల్ సాంగ్ కొరియోగ్రఫీలో నేను లేను. మా అసిస్టెంట్స్ చేశారు. సినిమాలో వచ్చే పాటలో సితార పాప కనిపించదు.  

కాపీ స్టెప్పులు అని విమర్శలు వస్తుంటాయి కదా ? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? 
మనం ఒరిజినల్ గా చేస్తే మనది మనకే తెలిసిపోతుంది. మూమెంట్ కంపోజ్ చేస్తున్నపుడే కొత్తగా వుందా లేదా ? అనేది అర్ధమైపోతుంది. 

డ్యాన్స్ కాకుండా సాంగ్ లో కోరియోగ్రఫర్ ఇన్పుట్స్ ఎలా వుంటాయి ? ప్రాపర్టీస్ ని కూడా సజస్ట్ చేస్తారా ?
కోరియోగ్రఫి అంటే డ్యాన్స్ మాత్రం కాదు.. సాంగ్ ని అందంగా ప్రజంట్ చేయాల్సిన బాధ్యత వుంటుంది. మూమెంట్స్ తో పాటు పాటలో కనిపించే ప్రాపర్టీ, కాస్ట్యూమ్స్ కూడా కొన్నిసార్లు చెబుతాం. దర్శకులు కూడా సూచనలు చేస్తారు. కళావతి పాటని ఫారిన్ లో షూట్ చేశాం. బ్యాగ్ గ్రౌండ్ లో సితారలు వుంటే బావుంటుంది అనిపించింది. దర్శకుడు పరశురాం గారికి చెప్పా. ఆయన ఓకే అన్నారు. అప్పటికప్పుడు వేరే చోట నుంచి తెప్పించి షూట్ చేశాం. సాంగ్ లో బ్యుటిఫుల్ గా కనిపించాయి.

మహేశ్‌ గారితో పని చేయడం ఎలా అనిపిస్తుంది ? మహేశ్‌ గారికి ఒక డ్యాన్స్ మాస్టర్ గా ఎన్ని మార్కులు వేస్తారు? 
మహేశ్‌బాబు గారితో పనిచేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఓకే అన్నా .. ''మాస్టర్ ఇంకోసారి చేద్దామా' అంటారు. ఈ సినిమాలో ఆయన మరింత అందంగా కనిపిస్తారు. డ్యాన్స్ విషయానికి వస్తే సర్కారు వారి పాటలో సరికొత్త మహేశ్‌బాబు గారిని చూస్తారు. మహేష్ గారి డ్యాన్సులకి వంద మార్కులు వేస్తా. 

మీ పిల్లల్ని కూడా ఈ రంగంలో ప్రోత్సహిస్తున్నారా ? 
ఈ మధ్య డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ పాప ప్యాషన్ డిజైన్ అవుతానని అంటుంది. బాబు డాక్టర్ అంటున్నాడు. ఏం కావాలో ఛాయిస్ వాళ్ళకే ఇచ్చేశా.

పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి కదా ? ఇది కొరియోగ్రఫీలో కూడా వుంటుందా ? 
కొరియోగ్రఫీకి అలా ఏం వుండదు. ఇప్పుడు పాన్ ఇండియా అని అంటున్నారు కానీ 'టాపు లేచిపోద్ది' పాటని ప్రపంచ వేదికలపై ప్రదర్శించారు. 'పుష్ప' మూమెంట్స్ కూడా పాన్ వరల్డ్ లో సందడి చేశాయి కదా. మూమెంట్ యునిక్ , క్యాచిగా వుంటే జనాల దృష్టిని ఆకట్టుకుంటుంది. టీమ్ ఇండియా క్రికెటర్లు, ఆస్ట్రేలియా ఆటగాళ్ళు మా మూమెంట్స్ రీల్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా వుంటుంది.
 
ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సాంగ్ ని ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా అంచనా వేశారు కదా ? 
ఆచార్య సాంగ్ ఎంత డిమాండ్ చేసిందో అంతా చేశాం. కథలో సందర్భాన్ని బట్టే కొరియోగ్రఫీ వుంటుంది.

కొరియోగ్రాఫేర్ గా మీ  డ్రీమ్ ఏమిటి ? 
చిరంజీవి గారికి, ప్రభు మాస్టర్ కి చేయాలని అనుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అయ్యింది.  రాజమౌళిగారితో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి చేయాలని వుంది. 

మీరు పని చేసిన హీరోల్లో తక్కువ టైంలో మూమెంట్స్ నేర్చుకునే హీరో ఎవరు?
ఎన్టీఆర్ గారు ఒక్కసారి కూడా రిహర్సల్ కి రాలేదు.  ఆయన స్పాట్ లో చేసేస్తారు. మిగతా హీరోలు కూడా ఒక సారి చెప్పిన వెంటనే మూమెంట్ పట్టేస్తారు.    

మీ అంచనాలు తప్పిన పాట ? 
'జైలవకుశ లో ట్రింగ్ ట్రింగ్ సాంగ్. చాలా కొత్తగా చేశాం. చాలా ఆదరణ పొందుతుందని భావించాం. కానీ అది అనుకున్నంత కనెక్ట్ కాలేదు. 

కోరియోగ్రఫీ విషయంలో ఇంకా చెన్నై మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉందా ? 
లేదు. ఇప్పుడు అంతా మన వాళ్ళకే ఇస్తున్నారు. నేను వచ్చిన కొత్తలో అక్కడ అనుభవం వున్న వారికి ఇచ్చేవాళ్ళు. ఇందులో నిర్మాతల తప్పులేదు. కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు. కొత్తవారితో రిస్క్ చేయలేరు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే అలోచించాల్సిందే.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ? 
చిరంజీవి గారు మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, రవితేజ గారి ధమాకా సినిమాలకి చేస్తున్నా. శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా. సల్మాన్ ఖాన్ రాధే కి కూడా పిలిచారు. కానీ నాకే కుదరలేదు.

చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్‌, టైటిల్‌ గెలిచే అర్హత లేదంటూ ట్రోలింగ్‌

నాన్నను బాత్రూమ్‌లో ఉంచి గడియ పెట్టడంతో ఫుల్‌ ఏడ్చేశా: నటి

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)