ప్రేమ్‌ రక్షిత్‌పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు

Published on Thu, 03/12/2026 - 22:22

ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ 'మైఖేల్ జాక్సన్'కు లెజెండరీ కొరియోగ్రాఫర్ 'విన్సెంట్ ప్యాటర్సన్' ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్‌వే, కచేరీలను విన్సెంట్ రూపొందించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి.. భారతీయ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌ను ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. 

వీడియో వైరల్‌
ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ ప్రశంసించడం భారతీయ డాన్స్ టాలెంట్‌కు గ్లోబల్ గుర్తింపు లభించడమే అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ప్రేమ్ రక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ప్రేమ్‌ ప్రతిభకు విన్సెంట్ పాటర్సన్ ఫిదా అయ్యారు. 'హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. నేను అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్. 

ఏదో ఒక రోజు కలుస్తా..
చాలా ఏళ్లు మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేశా. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నా. మీ కొరియోగ్రఫీ అద్భుతం. మీరు అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో యంగ్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారి కలలు సాధించుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిన్ను కలుస్తా రక్షిత్' అంటూ విన్సెంట్ వీడియోలో చెప్పారు.

ఎంతో ప్రత్యేకం
'నేను చిన్నప్పటి నుంచే స్మూత్ క్రిమినల్ పాటకు పెద్ద అభిమానిని. మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన ఒక లెజెండ్ నుంచి అభినందనలు అందుకోవడం కొరియోగ్రాఫర్‌గా ఎంతో ప్రత్యేకమైన విషయం. థాంక్స్‌ డియర్‌ విన్సెంట్ సర్' అని ప్రేమ్ రక్షిత్ రిప్లై ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. దాంతో  ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. చెన్నైలో పెరిగిన రక్షిత్.. ప్రభాస్‌'ఛత్రపతి'తో ప్రయాణం మొదలుపెట్టి.. 'బాహుబలి' వంటి అనేక పెద్ద చిత్రాలకు పనిచేశారు. తెలుగు, తమిళంలో దాదాపు 200కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)