ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి

Published on Sat, 05/06/2023 - 21:58

కొరియోగ్రాఫర్‌ చైతన్య ఏప్రిల్‌ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. జబర్దస్త్‌లో కన్నా ఢీలో తక్కువ పారితోషికం ఇస్తారని, ఇక్కడ పేరు మాత్రమే వస్తుందని ఆయన వాపోయాడు.  అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం చైతన్యకు అప్పులుండే అవకాశమే లేదని చెప్తూ వస్తున్నారు. తాజాగా చైతన్య తల్లి లక్ష్మి రాయ్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

'కాస్ట్యూమ్స్‌కు డబ్బులు కావాలంటూ రెండు, మూడు వేలు నా దగ్గర తీసుకునేవాడు. మీకు తెలియని ఇంకో విషయమేంటంటే.. ఢీ ఫైనల్‌ కోసం రూ.3,50,000 అడిగాడు. మా ఆయన్ని అడిగితే ఒప్పుకోలేదు. వాడిని చెడగొడుతున్నావు, డబ్బులివ్వను అన్నాడు. ఒక రోజంతా అలిగి కూర్చుంటే ఆ డబ్బంతా తెచ్చి ఇచ్చాడు. అమ్మ, నేను గెలిస్తే రూ.7,50,000 వస్తాయి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాడు.

కానీ ఫైనల్‌ దాకా వచ్చి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలియలేదు. ఇలా రెండుసార్లు జరిగింది. ఢీ షోకి వెళ్లిన తర్వాత దాదాపు రూ.6 లక్షల దాకా ఇచ్చాను. ఇంత చేసినదాన్ని ఏదైనా అప్పులున్నాయంటే తీర్చకపోయేదాన్నా? అప్పుల వల్ల చనిపోయాడనే మరక ఉండకూడదనే నా బాధ. ఢీ షోలో పేమెంట్స్‌ ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఢీ లేకపోతే మా అబ్బాయి లేడు. వాడికి ఇంత గుర్తింపు ఢీ వల్లే వచ్చింది' అని చెప్పుకొచ్చింది చైతన్య తల్లి.

చదవండి: క్రికెట్‌ జట్టు కొనుగోలు చేయనున్న రామ్‌చరణ్‌
నావల్ల హీరోయిన్‌ ఆత్మహత్య చేసుకుందన్నారు: నవదీప్‌

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)