Breaking News

తారక్‌ అద్భుతమైన డ్యాన్సర్‌.. ఆయన స్టెప్పులేస్తుంటే..: కొరియోగ్రాఫర్‌

Published on Wed, 07/24/2024 - 09:31

హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అద్భుతమైన డ్యాన్సర్‌.. ఎంతో అలవోకగా స్టెప్పులేస్తాడు. ఆయన డ్యాన్స్‌ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు అంటున్నాడు బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ బోస్కో మార్టిస్‌. ఈయన దేవర: పార్ట్‌ 1 సినిమాకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.

అద్భుతమైన డ్యాన్సర్‌
తాజాగా ఆయన దేవర విశేషాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నేను దేవర మూవీకి పని చేస్తున్నాను. హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అద్భుతమైన వ్యక్తి. సూపర్‌గా డ్యాన్స్‌ చేసే హీరోల్లో ఈయన ఒకరు. ఏ స్టెప్పులైనా సులువుగా నేర్చేసుకుంటాడు. ఆయన డ్యాన్స్‌ చేయడం చూస్తుంటే మనకే సంతోషంగా అనిపిస్తుంది. ఆయన డ్యాన్స్‌ మనం ఎంజాయ్‌ చేస్తాం. తనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం అని చెప్పుకొచ్చాడు.

ఆ వైరల్‌ స్టెప్పులు నేర్పింది ఈయనే!
బోస్కో ఇటీవలే తారక్‌తో కలిసి దిగిన ఫోటోను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ఇకపోతే ఈ మధ్య వైరల్‌గా మారిన తాబ తాబ..(విక్కీ కౌశల్‌ బ్యాడ్‌ న్యూస్‌ మూవీలోని ఓ సాంగ్‌) స్టెప్పులు కూడా ఈయన కనిపెట్టినవే! దేవర విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ కథానాయిక. ఈ మూవీని సెప్టెంబర్‌ 27న విడుదల చేయనున్నారు.

 

 

చదవండి: సినిమా దారుణంగా ఫ్లాప్‌.. ఆ బాధ్యత నాదే: దర్శకురాలు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)