Breaking News

ఇది రాకేశ్‌ మాస్టర్‌ విగ్రహమా? పుల్లయ్యలా ఉందంటూ విమర్శలు

Published on Fri, 08/04/2023 - 11:35

రాకేశ్‌ మాస్టర్‌ తెలుగు హీరోలకు డ్యాన్స్‌ నేర్పించాడు, డ్యాన్స్‌లో స్టైల్‌ ఎలా ఉంటుందో పరిచయం చేశాడు. వెండితెరపై ఎన్నో హిట్‌ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశాడు. టాప్‌ కొరియోగ్రాఫర్‌గా వెలుగు వెలిగిన ఆయన తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన రాకేశ్‌ మాస్టర్‌ జూన్‌ 18న మరణించాడు. ఆయనకు గుర్తుగా విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. రాకేశ్‌ మాస్టర్‌కు అత్యంత సన్నిహితుడు, తన చివరి శ్వాస వరకు పక్కనే ఉండి అన్నీ చూసుకున్న ఆలేటి ఆటం ఈ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు.

ఓ డ్యాన్స్‌ షోలో వైష్ణవుడి వేషధారణలో బీభత్సమైన పర్ఫామెన్స్‌ ఇచ్చాడు రాకేశ్‌ మాస్టర్‌. ఇది చాలామందికి ఇప్పటికీ గుర్తుండిపోయింది. అందుకే ఆ వైష్ణవుడి వేషధారణలోనే రాకేశ్‌ మాస్టర్‌ గెటప్‌ ఉండేలా విగ్రహాన్ని రెడీ చేయిస్తున్నారు. ఎవరి దగ్గరా సాయం కోసం చేతులు చాచకుండా సొంత డబ్బుతోనే దీన్ని రెడీ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రాకేశ్‌ మాస్టర్‌ శిష్యుడు, కొరియోగ్రాఫర్‌ బషీర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. రాకేశ్‌ మాస్టర్‌ విగ్రహం ఎలా ఉందో వీడియో రిలీజ్‌ చేశాడు. విగ్రహం ఎలా ఉందో కామెంట్స్‌లో తెలియజేయండని కోరాడు.

అయితే చాలామందికి ఈ విగ్రహం నచ్చినట్లు లేదు. ఇది రాకేశ్‌ మాస్టర్‌ విగ్రహంలా లేదు, పుల్లయ్యగాడి విగ్రహంలా ఉంది, మీకు ఏ ఫోటో దొరకలేదా భయ్యా? అస్సలు మ్యాచ్‌ కాలేదు అని కామెంట్లతో తిట్టిపోస్తున్నారు. ఒకరైతే.. వీడు దేనికి పనికిరాని వెధవ అని కామెంట్‌ చేయగా బషీర్‌ అందుకు సేమ్‌ టు యూ అంటూ రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఈ విగ్రహం పూర్తిగా తయారవడానికి మరో నెల రోజులు పడుతుందని మరో వీడియోలో వెల్లడించాడు బషీర్‌. పూర్తిగా సిద్ధమైన తర్వాతైనా అందరికీ నచ్చుతుందో, లేదో చూడాలి!

చదవండి: బతికుండగానే అంత్యక్రియలు, బ్యూటీ క్వీన్‌ కన్నుమూత

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి