Breaking News

చాలాకాలం తర్వాత రిలీజ్‌కు రెడీ అవుతున్న విక్రమ్‌ సినిమా

Published on Sun, 05/28/2023 - 07:38

తను నటించే పాత్రలకు 100 శాతం న్యాయం చేయడానికి తపించే నటుడు చియాన్‌ విక్రమ్‌. ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో చోళరాజు కరికాలన్‌గా అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి గుండెల్లో నిలిచిపోయిన విక్రమ్‌ తాజాగా తంగలాన్‌ చిత్రంలో గిరిజన వాసి పాత్రకు జీవం పోస్తున్నారు. ఈయన చాలాకాలం క్రితం కథానాయకుడిగా నటించిన చిత్రం ధ్రువనక్షత్రం. 

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్‌, రీతు వర్మ, హీరోయిన్‌లుగా నటించగా నటి సిమ్రాన్‌, పార్తీపన్‌, వినాయకన్‌, దివ్యదర్శిని, అర్జున్‌దాస్‌, వంశీకృష్ణ, రాధిక శాస్త్రకుమార్‌, మాయా ఎస్‌.కృష్ణన్‌, అభిరామి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉండిపోయింది. అయితే దీని విడుదలకు ఇప్పుడు టైమ్‌ వచ్చినట్లు సమాచారం.

ఇటీవలే దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చిత్రం ప్యాచ్‌ వర్క్‌ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసినట్లు, నటుడు విక్రమ్‌ డబ్బింగ్‌ కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. మరో విశేషమేమిటంటే ఈ చిత్ర విడుదల హక్కులను రెడ్‌జెయింట్‌ మూవీస్‌ సంస్థ పొందినట్లు సమాచారం. చిత్రాన్ని జులై 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా నటుడు విక్రమ్‌ డిఫరెంట్‌ గెటప్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)