Breaking News

స్టార్‌ హీరో విక్రమ్‌కు తీవ్ర గాయాలు

Published on Wed, 05/03/2023 - 12:30

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ షూటింగ్‌ సెట్‌లో తీవ్రంగా గాయపడ్డారు. తంగలాన్‌ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు విక్రమ్‌ పక్కటెముక విరిగినట్లు గుర్తించారు. అతడికి ఆపరేషన్‌ చేయాలని తెలిపారు. ఈ ప్రమాద విషయాన్ని ఆయన మేనేజర్ సూర్యనారాయణ్ ధ్రువీకరించారు. తంగలాన్ షూటింగ్‌కు ముందు రిహార్సల్ చేస్తుండగా విక్రమ్ గాయపడ్డారని తెలిపారు.

కొద్ది రోజులపాటు ఆయన షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. అయితే అతి త్వరలోనే కోలుకొని విక్రమ్ మళ్లీ షూటింగ్ కు హాజరవుతారని వెల్లడించారు. మరోవైపు ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ రెండో భాగం ఘన విజయాన్ని అందుకోవడంతో ఆనందంలో ఉన్న విక్రమ్ అభిమానులు... విక్రమ్ గాయపడ్డారనే విషయం తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

కాగా తంగలాన్‌ సినిమాకు కబాలి డైరెక్టర్‌ పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవిక మోహన్‌, పార్వతి మీనన్‌, పశుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్‌ ఫిలింగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అతడు ప్రోస్తటిక్‌ మేకప్‌ వేసుకుంటున్నాడు. తమిళ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తంగలాన్‌ రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

చదవండి: రష్మికతో డేటింగ్‌.. స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్‌

Videos

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

రోజులన్నీ ఒకేలా ఉండవు.. చంద్రబాబు లాంటోడే జైలుకు వెళ్ళాడు నువ్వెంత

తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్ YSRCP కార్యాలయానికి తాళం వేసిన JCవర్గీయులు

DSC అక్రమాలపై లోకేష్‌ జైలుకు వెళ్లడం పక్కా

సెప్టెంబర్లోనే నా పాదయాత్ర రాసిపెట్టుకోండి హిస్టరీ రిపీట్ చేద్దాం

మిడ్ నైట్ గుస గుసలు.. ఆటను రామ్ ప్రసాద్ మారుస్తున్నాడా?

2019 హిస్టరీ రిపీట్ చేద్దాం.. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం

Photos

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)