Breaking News

మజాకా హీరోయిన్‌ మూవీ.. ఏడేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్‌!

Published on Thu, 02/27/2025 - 17:03

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'ధృవ నచ్చితిరమ్'(తెలుగులో ధృవ నక్షత్రం ). 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు థియేట్రికల్ రిలీజ్ కాలేదు. ఈ మూవీని గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. 2018లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు అనివార్య కారణాలతో పాటు ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు ఏడేళ్లుగా ఈ మూవీ విడుదలకు మోక్షం మాత్రం లభించడం లేదు. గతేడాది కూడా రిలీజ్‌ అవుతుందని వార్తలొచ్చినా అలా మాత్రం జరగలేదు. అయితే ఈ చిత్రంలో మజాకా మూవీ హీరోయిన్ రీతూ వర్మ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై మరోసారి టాక్ వినిపిస్తోంది. అన్ని సజావుగా సాగితే ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుందని తాజా సమాచారం. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని కుదిరితే మే 1న కార్మిక దినోత్సవం రోజున ధృవ నచ్చతిరమ్ థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది. అదే జరిగితే సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ కాంబోలో వస్తోన్న రెట్రోతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా.. గతంలో ధృవ నచ్చతిరమ్ మూవీని మొదట సూర్యతో ప్లాన్ చేశారు. కానీ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో విభేదాల కారణంగా సూర్య ఈ చిత్రం నుండి వైదొలిగాడు. ఆ తర్వాత  చియాన్ విక్రమ్‌ని సినిమాను తెరకెక్కించాడు. కాగా.. 2017లో సెట్స్‌పైకి వెళ్లిన ధృవ నచ్చితిరమ్ ఆర్థికపరమైన సమస్యలతో 2023లో పూర్తయింది. అప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మాత్రం విడుదల కాలేదు. కాగా.. ఈ చిత్రంలో నటుడు సిమ్రాన్, పార్థిబన్, రాధిక శరత్‌కుమార్, వినాయకన్, దివ్యదర్శిని, వంశీకృష్ణ   ముఖ్యపాత్రలు పోషించారు. 

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)