Breaking News

ఆయనతో సినిమా చేయలేదని రెండు నెలలు ఏడ్చా: హీరో

Published on Mon, 09/02/2024 - 18:58

మణిరత్నం సినిమాలో నటించే ఛాన్స్‌ చేజారడంతో రెండు నెలలు ఏడ్చానంటున్నాడు హీరో చియాన్‌ విక్రమ్‌. బొంబాయి సినిమాలో నటించే ఛాన్స్‌ ఫస్ట్‌ తనకే వచ్చిందని, కానీ మిస్సయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్రమ్‌ మాట్లాడుతూ.. నాకు బొంబాయి సినిమా ఆఫర్‌ వచ్చింది. ఆడిషన్‌కు కూడా వెళ్లాను. 

ప్రతి ఒక్కరి కల
కాకపోతే అక్కడ ఒక వీడియో కెమెరాకు బదులు స్టిల్‌ కెమెరా ముందు పెట్టి నటించమన్నాడు. నీ ముందు ఒక అమ్మాయి పరిగెడుతుంది. తనను చూస్తూ ఉండిపోవాలన్నాడు. నాకేం అర్థం కాలేదు. అక్కడ వీడియో కెమెరానే లేనప్పుడు నేనెందుకు నటించాలన్నట్లు ఊరికనే నిలబడ్డాను. దీంతో ఆ మూవీలో నన్ను సెలక్ట్‌ చేయలేదు. మణిరత్నంతో సినిమా చేయాలన్నది ప్రతి ఒక్క నటుడి కల. 

ఇంకేం వద్దనుకున్నా..
ఆయనతో ఒక్క సినిమా చేసి రిటైర్‌ అయిపోయినా చాలనుకున్నాను. అంతకంటే ఎక్కువ ఏదీ ఆశించలేదు. ఉదయం మనీషా కొయిరాలా ఫోటోషూట్‌, సాయంత్రం నాది. కానీ ఇంతలోనే అంతా బెడిసికొట్టింది. రెండునెలలపాటు ఏడుస్తూనే ఉన్నాను. అయ్యో, మణిరత్నం సినిమా చేజారిపోయిందేనని బాధపడుతూనే ఉన్నాను. 

ప్రతీకారం తీర్చుకున్నా
తర్వాత బొంబాయి మూవీ పాన్‌ ఇండియా రేంజ్‌లో హిట్టయింది. అయితే తర్వాత మాత్రం ఆయనతో రెండు సినిమాలు తీసి ప్రతీకారం తీర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా విక్రమ్‌ తర్వాత మణిరత్నం డైరెక్షన్‌లో రావన్‌, పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాలు చేశాడు.

చదవండి: పదేళ్లుగా ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నా: సాయి పల్లవి

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)