Breaking News

వెల్‌కమ్‌ వెంకీ 

Published on Fri, 10/24/2025 - 04:19

‘వెల్‌కమ్‌ వెంకీ... మై బ్రదర్‌!’ అంటూ వెంకటేశ్‌ని ఆప్యాయంగా సెట్స్‌కి ఆహ్వానించారు చిరంజీవి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్‌ కీలక పాత్ర  పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో హీరో వెంకటేశ్‌ కీలక పాత్ర  పోషించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు వెంకటేశ్‌. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించి, ఓ వీడియోను విడుదల చేసింది. ‘వెల్‌కమ్‌ వెంకీ... మై బ్రదర్‌...’ అంటూ చిరంజీవి ఆప్యాయంగా వెంకటేశ్‌ని పిలవగా, ‘చిరు సార్‌... మై బాస్‌...’ అంటూ చిరంజీవిని హత్తుకున్నారు వెంకటేశ్‌. 

‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్‌ ఎలిమెంట్స్‌ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్‌ ట్రీట్‌. చిరంజీవి– వెంకటేశ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కి డబుల్‌ ఫెస్టివల్‌. ఈ సినిమాలో వెంకటేశ్‌ లెంగ్తీ, క్రూషియల్‌ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో చిరంజీవి–వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. కాగా.. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)