Breaking News

విశ్వంభర బుక్‌లో ఏముంది?

Published on Fri, 05/23/2025 - 01:04

‘విశ్వంభర’ బుక్‌లో ఏముంది? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్‌ అంటున్నారు నిర్మాత విక్రమ్‌ రెడ్డి. చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ యాక్షన్‌ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్, విక్రమ్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపోస్ట్‌ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. టాప్‌ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిపోస్ట్‌ప్రోడక్షన్, వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.

మిగతా పనులు వేగంగా సాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న 78వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘విశ్వంభర’ సినిమాకు చెందిన బుక్‌ను రిలీజ్‌ చేశారు ఈ చిత్రనిర్మాత విక్రమ్‌ రెడ్డి. అలాగే కాన్స్‌లోని భారత పెవిలియన్‌లో ‘విశ్వంభర’ సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్‌ విశేషాలు, వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోల సహకారం గురించిన పలు విశేషాలను ఆయన తెలిపారు. కీరవాణిగారు అద్భుతమైన మ్యాజిక్, ఆర్‌ఆర్‌ అందించారని, ఛోటా కె. నాయుడు విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. 

అంతర్జాతీయ స్థాయిలో..
భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం బయోపిక్‌ ‘కలాం: ది మిస్సైల్‌ మ్యాన్  ఆఫ్‌ ఇండియా’ను కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్‌ టైటిల్‌ రోల్‌లో నటించనున్న ఈ బయోపిక్‌కు ఓం రౌత్‌ దర్శకత్వం వహించనున్నారు. గుల్షన్‌ కుమార్, తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్, టీ– సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్, అనిల్‌ సుంకర, భూషణ్‌ కుమార్, క్రిషన్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

‘కలాం: ది మిస్సైల్‌ మ్యాన్  ఆఫ్‌ ఇండియా’ సినిమాను ప్రకటించిన తర్వాత, ఈ సినిమాను గురించి కాన్స్‌లోని భారత్‌ పెవిలియన్‌లో ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడారు. ‘‘ఏపీజే అబ్దుల్‌ కలాంగారి జీవితం ప్రపంచవ్యాప్త యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన బయోపిక్‌ను తెరకెక్కడం బాధ్యతతో కూడిన సవాల్‌లాంటింది’’ అని పేర్కొన్నారు ఓం రౌత్‌. ‘‘ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నందుకు గౌరవంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని తెలిపారు అభిషేక్‌ అగర్వాల్‌.

సోనమ్‌.. ఓ హాట్‌ టాపిక్‌ 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది బొమ్మ ఉన్న నెక్లెస్‌ను ధరించి, కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరై చర్చనీయాంశమయ్యారు రాజస్థాన్‌ నటి–మోడల్‌ రుచి గుజ్జర్‌. ఈ విషయాన్ని మరవక ముందే ఇండియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సోనమ్‌ చబ్రా ధరించిన కాస్ట్యూమ్‌ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో చర్చనీయాంశమైంది. సోనమ్‌ చబ్రా డ్రెస్‌పై భారతదేశంపై జరిగిన ఉగ్రదాడుల (ఇటీవల జరిగిన పహల్గాం, గతంలో జరిగిన ఉరి, పుల్వామా..’) పేర్లు ఉన్నాయి.

అలాగే ఐశ్వర్యా రాయ్‌ 22వ సారి కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఐశ్వర్యా రాయ్‌ నుదుట సిందూర్‌ హైలైట్‌ అయ్యేలా ఉంది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇలా ఐశ్వర్యా రాయ్‌ సిందూరం ధరించారనే టాక్‌ సోషల్‌ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఇంకా భారతీయ నటి అదితీరావ్‌ హైదరీ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌పై నడిచారు.

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)