Breaking News

ఐదుగురు ‘మెగా’ హీరోలు.. 30 రోజులు.. 4 సినిమాలు

Published on Sun, 07/09/2023 - 16:07

ఈ ఏడాది ‘మెగా’ అభిమానులకు చాలా స్పెషల్‌. మెగా ఫ్యామిలీలో వరుస శుభకార్యాలతో పాటు వరుస సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి మొదలు.. వైష్ణవ్‌ తేజ్‌ వరకు ఈ ఏడాదిలో ఒకటి, రెండు చిత్రాలను ఫ్యాన్స్‌కు అందించబోతున్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలో మెగా ఫ్యామిలీ నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. 



‘బ్రో’
పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. వినోదయ సీతమ్మకు తెలుగు రీమేక్‌ ఇది. సముద్రఖని దర్శకుడు. మెగా హీరోలు ఇద్దరు కలిసి నటించిన చిత్రం కావడంతో ‘బ్రో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

భోళాశంకర్‌
బ్రో సినిమా విడుదలైన రెండు వారాలేకే భోళాశంకర్‌ సినిమా రాబోతుంది. తమిళ సూపర్‌ హిట్‌ వేదాళంకు తెలుగు రీమేక్‌ ఇది. మోహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 11న లీజ్‌ కాబోతుంది. 

ఆదికేశవ
భోళా శంకర్‌ రిలీజైన వారం రోజులకే అంటే ఆగస్ట్‌ 18న వైష్ణవ్‌ తేజ్‌ నటించిన ఆదికేశవ చిత్రం విడుదల కాబోతుంది. వైష్ణవ్‌ కెరీర్‌లో నాలుగో చిత్రమిది. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీలీల హీరోయిన్‌. 

‘గాండీధారి అర్జున’
ఆదికేశవ వచ్చిన మరో వారానికే మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించిన ‘గాండీధారి అర్జున’ చిత్రం రాబోతుంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మొత్తానికి జులై  నెలాఖరు నుంచి ఆగస్ట్‌ ఎండింగ్‌ వరకు... నెల రోజుల పాటు ఐదుగురు మెగా హీరోలు  నాలుగు సినిమాలతో సందడి చేయబోతున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)