Breaking News

కౌబాయ్‌ సినిమా చేస్తానని అసలు ఊహించలేదు: మెగాస్టార్‌ చిరంజీవి

Published on Wed, 11/19/2025 - 23:10

మెగాస్టార్‌ చిరంజీవి 35 ఏళ్ల క్రితం నటించిన యాక్షన్‌, అడ్వెంచర్‌ చిత్రం ‘కొదమసింహం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990లో విడుదలైన ఈ సినిమా ఈ నెల 21న రీ–రిలీజ్‌ కానుండటంతో హైదరాబాద్‌లో ప్రీమియర్‌ షో ఏర్పాటు చేశారు. షో అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మురళీ మోహన్‌ రావు, సంగీత దర్శకుడు కోటి తో పాటు చిత్ర బృందం అందరు పాల్గొన్నారు.

కాగా స్పెషల్ వీడియో ద్వారా స్పందించిన చిరంజీవి మాట్లాడుతూ.. "కౌబాయ్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి పాత్రలో నేను నటిస్తానని అసలు ఊహించలేదు" అని అన్నారు. ‘కొదమసింహం’ తన సినీ కెరీర్‌లోనే ఒక ప్రత్యేక చిత్రం అని, ఆ కాలంలో ఒక కొత్త జానర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మూవీగా పేర్కొన్నారు. 

‘కొదమసింహం’ ఈసారి కూడా థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందాలని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. రీమాస్టర్ చేసిన విజువల్స్‌, మెరుగైన సౌండ్‌ క్వాలిటీతో ఈ రీ–రిలీజ్‌ థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)