Breaking News

సెకండాఫ్‌ అంతా కంటతడి: రంగమార్తాండపై చిరంజీవి రివ్యూ

Published on Sat, 03/25/2023 - 11:47

ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రంగమార్తాండ. మరాఠీలో సూపర్‌ హిట్‌ అయిన నటసామ్రాట్‌కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. మార్చి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్‌ చిరంజీవి రివ్యూ ఇచ్చాడు.

'రంగమార్తాండ సినిమా చూశాను. ఇటీవలి కాలంలో వచ్చినవాటిలో ఓ ఉత్తమ చిత్రమిది. ప్రతి ఆర్టిస్ట్‌కు తన జీవితాన్ని కళ్ల ముందు చూస్తున్నట్టనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం ఓ త్రివేణి సంగమంలా అనిపించింది. కృష్ణవంశీలాంటి ఒక క్రియేటివ్‌ డైరెక్టర్‌, ప్రకాశ్‌ రాజ్‌ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, హాస్య బ్రహ్మానందంల కలయిక, వారి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరి అద్భుత నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. 

బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న ఓ అనూహ్య పాత్రను చేయడం ఇదే తొలిసారి. సెకండ్‌ హాఫ్‌ మొత్తం అప్రయత్నంగానే కంటతడి నిండింది. ఓ కంప్లీట్‌ ఎమోషనల్‌ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించాలి. ఇలాంటి రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాశ్‌ రాజ్‌కు, రమ్యకృష్ణకు చిత్రయూనిట్‌ అందరికీ అభినందనలు' అంటూ ట్విటర్‌లో రంగమార్తాండ టీమ్‌కు అభినందనలు తెలియజేశాడు చిరు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)