Breaking News

ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా.. ఇలా అవుతుందని ఊహించలేదు: చిరంజీవి

Published on Sun, 09/11/2022 - 13:37

ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలించారు.అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు  నివాళులు అర్పించారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.ఈ సందర్భంగా కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈరోజు చాలా దుర్ధినమని, ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చిరంజీవి పేర్కొన్నారు.

ఆయన తీరు ఎంతో రాజసంగా ఉండేది : చిరంజీవి
ఆయన గతంలో చాలాసార్లు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ప్రతిసారి ఆరోగ్యంగా తిరిగి వచ్చేవారు. ఈసారి కూడా అలాగే ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా. ఇలా అవుతుందని ఊహించలేదు. మొగల్తూరులో  చిన్నపుడు అయన చూడటం కోసం ఎగబడిన  వాళ్ళలో నేను ఉన్నను. ఇంకా ఆ దృశ్యం నా కళ్ళలో కదలాడుతూ ఉంది.ఆయన తీరు ఎంతో రాజసంగా ఉండేది.రావుగోపాల్ రావు లాంటి వాళ్లు రాజావారు రాజావారు అని పిలిచేవారు.కృష్ణంరాజు మహావృక్షం లాంటివారు ఈరోజు ఆ మహావృక్షం నేలకొరిగింది.పరిపూర్ణమై జీవితాన్ని అనుభవించారు..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోుకుంటున్నాను అని పేర్కొన్నారు.

చాలా మంచి మనిషి.. దురదృష్టకరం : దిల్‌రాజు
'మంచి మనిషి, మహ మనిషి అయన్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన లానే అన్ని గుణాలు ప్రభాస్‌లో ఉన్నాయి. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'

నాకు చాలా బాధాకరమైన రోజిది : మహేష్ బాబు
'కృష్ణంరాజు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. నాకు, చిత్ర పరిశ్రమకు చాలా బాధాకరమైన  రోజిది. కృష్ణంరాజు గారి జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.ప్రభాస్‌, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'. 



మా ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తి కృష్ణంరాజు: పవన్ కళ్యాణ్
ఎంతో సుప్రసిద్ధ నటుడు, మా కుటుంబానికి ఎంతో సానిహిత్యం ఉన్న వ్యక్తి. అందరి మంచి కోరుకునే వ్యక్తి. మా ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తి కృష్ణం రాజు.ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

Photos

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)