Breaking News

చిరంజీవితో 'మెగా' సినిమా ప్లాన్‌ చేస్తున్న హిట్‌ డైరెక్టర్‌

Published on Sun, 02/02/2025 - 07:57

టాలీవుడ్‌లో వరుస హిట్‌ సినిమాలతో డైరెక్టర్‌ బాబీ కొల్లి  స్పీడ్‌ పెంచాడు.. తాజాగా డాకు మహారాజ్‌తో బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను మెప్పించాడు. 2023 సంక్రాంతి సమయంలో మెగాస్టార్‌ చిరంజీవితో(Chiranjeevi) వాల్తేరు వీరయ్య చిత్రం ద్వారా సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఇలా భారీ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఆయన మరోసారి చిరంజీవితో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. అందుకు సంబంధించిన కథను కూడా బాబీ రెడీ చేస్తున్నాడట. ఈ సారి మరింత బలమైన కథతో పాటు పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి కూడా వరుస సినిమాలతో వేగం పెంచుతున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ ముగింపు దశకు చేరుకుంది. 2025 సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఆ వెంటనే దర్శకులు అనిల్‌ రావిపూడి, శ్రీకాంత్‌ ఓదెలతో మెగా సినిమాలను చిరు ప్లాన్‌ చేశారు. అయితే, వీరిలో మొదట అనిల్‌ సినిమానే ప్రారంభం అవుతుందని సమాచారం. ఇలా రెండు ప్రాజెక్ట్‌లు తన చేతిలో ఉండగానే బాబీ కొల్లికి చిరు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని తెలుస్తోంది.  

ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించే అవకాశముంది. కమర్షియల్‌ చిత్రాల్ని తనదైన పంథాలో తెరకెక్కిస్తూ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా బాబీ పేరు తెచ్చుకున్నారు. చిరుతో వాల్తేరు వీరయ్యను తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి వస్తున్నారనే వార్తలు రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)