Breaking News

నాగబంధం ఆరంభం

Published on Tue, 10/15/2024 - 01:51

‘పెదకాపు’ చిత్రం ఫేమ్‌ విరాట్‌ కర్ణ హీరోగా ‘నాగబంధం– ది సీక్రెట్‌ ట్రెజర్‌’ అనే సినిమా ఆరంభమైంది. ‘డెవిల్‌: ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ తో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్‌ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.     నభా నటేష్, ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బీఎస్‌ అవినాష్‌ ఇతర పాత్రలు పోషించనున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ ‡్ష నామా సమర్పణలో ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్‌ పిక్చర్స్‌పై కిషోర్‌ అన్నపురెడ్డి నిర్మిస్తున్న ‘నాగబంధం’ సోమవారం హైదరాబాద్‌లోప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో చిరంజీవి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, తొలి సన్నివేశానికి డైరెక్టర్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించారు. నిర్మాత సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. ఈ సందర్భంగా నిర్మాత కిషోర్‌ అన్నపురెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగబంధం– ది సీక్రెట్‌ ట్రెజర్‌’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ని ఈ నెల 23 నుంచిప్రారంభిస్తున్నాం.

2025లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయి. ఆ నేపధ్యంలో ఈ చిత్ర కధ  ఉంటుంది’’ అని అభిషేక్‌ నామా తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తారక్‌ సినిమాస్, కెమెరా: సౌందర్‌ రాజన్‌ ఎస్, సంగీతం: అభే, సీఈఓ: వాసు పోతిని, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: అభినేత్రి జక్కల్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)