Breaking News

ఇంద్ర గుర్తుగా.. అశ్వనీదత్‌కు కానుక ఇచ్చిన చిరంజీవి

Published on Sat, 08/24/2024 - 16:44

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఇంద్ర సినిమా రీ-రిలీజ్‌ అయింది. చిరు కెరియర్‌లో ఇంద్ర సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సినిమాను అందించిన నిర్మాత అశ్వనీదత్‌కు చిరంజీవి విలువైన కానుకను అందించారు. ఎన్నో రికార్డ్స్‌ను కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో వైజయంతి మూవీస్ రీ-రిలీజ్‌ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటిరోజే ఏకంగా రూ.3.05 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. ఈ సంతోష సమయంలో ఇంద్ర సినిమాకు పనిచేసిన కీలక వ్యక్తులను చిరంజీవి సత్కరించారు.

ఇంద్ర సినిమాలో భాగమైన నిర్మాత అశ్వనీదత్‌, దర్శకుడు బి.గోపాల్‌, సంగీత దర్శకుడు మణిశర్మ, సినీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, కథ రచయిత చిన్నికృష్ణలను తన ఇంటికి ఆహ్వానించిన చిరు వారిని సత్కరించారు. ఈ క్రమంలో నిర్మాత అశ్వనీదత్‌కు ఒక శంఖాన్ని బహుమతిగా చిరు ఇచ్చారు. తాజాగా ఇదే విషయాన్ని అశ్వనీదత్‌ తన ఎక్స్‌ పేజీ ద్వారా ఇలా తెలిపారు.  'మీరు ఈ విజయశంఖాన్ని కానుకగా నాకు ఇచ్చారు ... కానీ ఇంద్రుడై, దేవేంద్రుడై పూరించింది మాత్రం ముమ్మాటికీ మీరే. ఈ కానుక అమూల్యం. ఈ జ్ఞాపకం అపురూపం. అదెప్పటికీ నా గుండెల్లో పదిలం.' అంటూ పేర్కొన్నారు. 

వైజయంతి మూవీస్‌లో మెగాస్టార్‌ ఇప్పటి వరకు జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని వుంది,ఇంద్ర, జై చిరంజీవ చిత్రాల్లో నటించారు. అయితే, త్వరలో ఐదో చిత్రం కూడా నిర్మిస్తానని అశ్వనీదత్‌ ప్రకటించారు.

2002 జులై 22 ‘ఇంద్ర’ రిలీజ్‌ అయింది. మొత్తం 268 స్క్రీన్‌లలో ఇంద్ర సినిమాని రిలీజ్ చేశారు. 35 కేంద్రాలలో 100 రోజులు, 22 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. చిరు రెమ్యునరేషన్‌ కాకుండా రూ. 7కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)