Breaking News

కాజల్‌, తమన్నాని గుర్తుపట్టలేకపోయిన చిరంజీవి!

Published on Thu, 01/29/2026 - 15:09

మెగాస్టార్‌ చిరంజీవి.. 70 ఏళ్లు దాటినా నేటి తరం హీరోలకు పోటీ ఇచ్చేలా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.  ఇకపై ఏడాదికి ఒక సినిమా వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. అయితే రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్‌ స్థాయికి తగ్గ విజయం దక్కలేదనే మెగా అభిమానుల బాధ.. ‘మనశంకర వరప్రసాద్‌ గారు’ చిత్రంతో తీరిపోయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 

మెగా ఫ్యాన్స్‌తో పాటు చిరంజీవి కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తన సంతోషాన్ని షేర్‌ చేసుకోవడానికి తాజాగా సీనియర్‌ పాత్రికేయులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. 

రాజకీయాల్లోకి వెళ్లడంతో దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైనా.. ఆ ఫీలింగ్‌ కలగలేదట. కానీ రాజకీయాల్లో బిజీ కావడంతో కొత్తగా వచ్చిన నటీనటుల గురించే తెలుసుకోలేకపోయారట. రీఎంట్రీ తర్వాత చేసిన తొలి సినిమా ‘ఖైదీ 150’ లో హీరోయిన్‌గా నటించిన కాజల్‌ గురించి అప్పటి వరకు చిరంజీవికి తెలియట. ‘ఖైదీ 150 సినిమాలో కాజల్‌ హీరోయిన్‌ అని చెబితే.. అసలు కాజల్‌ ఎవరు అని అడిగేశా. అంతలా ఇండస్ట్రీని మర్చిపోయా. తమన్నా అంటే ఎవరో కూడా తెలియదు. అంతలా ఇండస్ట్రీని మర్చిపోయాను. రీఎంట్రీ తర్వాత ఇండస్ట్రీని ఎంత గా మిస్‌ అయ్యానో అర్థమైంది’ అని చిరంజీవి అన్నారు. అంతేకాదు తన అనుభవాలన్నీ కలిసి కొన్ని పాడ్‌ కాస్ట్‌లు చేయాలనే ఆలోచన కూడా ఉందని చెప్పారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)