Breaking News

నటుడిగా 50 ఏళ్లు పూర్తి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్

Published on Sat, 10/26/2024 - 09:38

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చాలు తెలుగు ప్రేక్షకులకు, కొత్తగా ఏం చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 40 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటినుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ అనే రేంజ్ వరకు వచ్చారు. ఎంత ఎదిగినా మూలాలు, జ్ఞాపకాల్ని మర్చిపోకూడదని చాలామంది చెబుతుంటారు. ఇప్పుడు చిరు కూడా అదే చేశారు. స్పెషల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చారు. నలుగురు హీరోల్లో ఒకడిగా చేసిన 'పునాదిరాళ్లు' తొలి సినిమా. ఆ తర్వాత తనదైన యాక్టింగ్‪‌తో హీరోగా ఎదిగారు. అద్భుతమైన, టాలీవుడ్ గుర్తుంచుకునే సినిమాలు చేశారు. అయితే చిరంజీవికి నటుడిగా తొలి అడుగు పడింది మాత్రం డిగ్రీ రోజుల్లోనే. రెండో ఏడాది చదువుతున్నప్పుడు 'రాజీనామా' అనే నాటకాన్ని వేశారు.

(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)

ఈ నాటకానికి గానూ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ ఆఫ్ కాలేజీగా అవార్డ్ వచ్చింది. ఇదంతా 1974-75 టైంలో జరిగింది. తొలి నాటకం వేసిన సందర్భంగా తీసుకున్న ఫొటోని చిరంజీవి ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్త మెగా అభిమానులకు చాలా స్పెషల్ అనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ చిరులో ఎంత మారిపోయారో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకుడు. అనుకున్న ప్రకారమైతే సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ కొడుకు రామ్ చరణ్ కోసం చిరు తన మూవీని వాయిదా వేసుకున్నారు. వేసవిలో 'విశ్వంభర' చిత్రం థియేటర్లలో రిలీజయ్యే అవకాశముంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)