హాలీవుడ్ ఉలిక్కిపడేలా..!NTR NEEL భారీ యాక్షన్ సీక్వెన్స్
Breaking News
'ఉప్పెన' తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!
Published on Wed, 01/21/2026 - 08:30
హిట్ కొట్టడం ఈజీనే. కానీ దాన్ని కొనసాగిస్తూ సినిమాలు చేయడం, అవకాశం దక్కించుకోవడం చాలా కష్టం. చాలా కొద్దిమంది హీరోహీరోయిన్లకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అవును ఇదంతా హీరోయిన్ కృతిశెట్టి గురించే. 'ఉప్పెన'తో హీరోయిన్‌గా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. తర్వాత చాలానే మూవీస్ చేసింది గానీ సరైన హిట్ కొట్టలేకపోయింది. ఇప్పుడు మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: మేడారం జాతర మొక్కు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు!)
ప్రస్తుతం 'మన శంకరవరప్రసాద్' చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి.. త్వరలో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నారు. ఇదివరకే దర్శకుడు బాబీతో చిరు మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ కానుందని, మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలోనే కృతిశెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. చాలామంది హీరోయినా అని అనుకుంటున్నారు. కానీ చిరు కుమార్తె పాత్రలో కృతి కనిపించనుందని టాక్.
గతంలో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో తొలి హిట్ అందుకున్న చిరు-బాబీ.. ఇప్పుడు బెంగాల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కూతురు సెంటిమెంట్ కాన్సెప్ట్‌తో మూవీ చేయనున్నారని టాక్. మలయాళ హీరో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారని టాక్. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా పలువురు పేర్లు అనుకుంటున్నప్పటికీ ప్రియమణిని ఫైనల్ చేశారని అంటున్నారు. అలానే ఏఆర్ రెహమాన్‌ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. మరి ఈ విషయాల్లో ఎంత నిజముందనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్సుంది.
(ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?)
Tags : 1