Breaking News

బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌కు 'మెగా' ఆఫర్‌

Published on Sat, 02/22/2025 - 10:13

'భోళాశంకర్' పరాజయం తర్వాత చిరంజీవి చాలా సినిమాలను లైన్‌లో పెట్టారు. ముఖ్యంగా యంగ్​ డైరెక్టర్స్​ కథలను ఎక్కువగా వింటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంభరతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, దసరా మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్‌లో ఒకప్పుడు అందాలభామగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

మెగాస్టార్‌ చిరుతో క్రేజీ కాంబోను  హీరో నాని సెట్‌ చేశారని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి సమర్పకుడిగా నాని వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి హీరో నాని ట్విటర్‌(ఎక్స్) వేదికగా గతంలో పంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆయన షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌లో హైప్‌ పెంచారు. 

అయితే, ఈ మూవీలో చిరు సరసన నటించే హీరోయిన్‌ పాత్ర కథకు చాలా ప్రాముఖ్యతను ఇస్తుందట.  ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే సెట్‌ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల అన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిరుతో చెప్పగా..  ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టు సరిజోడీగా  రాణీ ముఖర్జీ మంచి సెలక్షన్‌ అని చిరు కూడా అన్నారట.  ఇదే వార్త బాలీవుడ్‌ సర్కిల్‌లో ట్రెండ్‌ అవుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)