Breaking News

చలో డెహ్రాడూన్‌

Published on Fri, 06/06/2025 - 01:01

డెహ్రాడూన్‌ వెళ్తున్నారట చిరంజీవి అండ్‌ టీమ్‌. చిరంజీవి హీరోగా అనిల్‌ రాపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మరో హీరోయిన్‌ పాత్రలో కేథరిన్, ఓ కీలకమైన అతిథి పాత్రలో వెంకటేశ్‌ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

చిరంజీవితో పాటు ఈ సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ డెహ్రాడూన్, ముస్సోరి లొకేషన్స్‌లో జరుగుతుందని, అక్కడ ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ షెడ్యూల్‌ దాదాపు రెండు వారాలు సాగుతుందట. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)