Breaking News

బాలకృష్ణ వ్యాఖ్యలపై మరోసారి 'చిరు' కామెంట్

Published on Mon, 09/29/2025 - 16:04

కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్‌ చిరంజీవిని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సాక్షిగా  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో విదేశాల్లో ఉన్న చిరంజీవి ఆ కామెంట్లపై  స్పందిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అయితే, తాజాగా చిరు తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియా వారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు.

చిరంజీవి తన వెకేషన్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో దిగారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడాలని మీడియా వారు కోరారు. అయితే, విలేకరులు అడిగే ప్రశ్నలను ఆయన దాటవేశారు. ఇప్పటికే తాను చెప్పాల్సింది చెప్పేశానని క్లారిటీ ఇచ్చారు. ఇక మాట్లాడాల్సింది ఏం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిరు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకి వస్తున్నారనే విషయం తెలిసి అభిమానులు భారీగానే వచ్చారు. వారితో సెల్ఫీలు ఇస్తూ దిగి ఆయన వెళ్లిపోయారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే మీడియాకు లేఖ రాసిన చిరంజీవి.

బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులతో పాటు కాపు సామాజికవర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే చిరుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జనసేన అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు బాలకృష్ణ వ్యాఖ్యల వల్ల చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే పవన్‌కళ్యాణ్‌ను చంద్ర­బాబు  పరామర్శించారన్న చర్చ కూడా జరుగుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)