Breaking News

మైనర్‌గా ఉన్నప్పటి నుంచే 'జానీ' వేధించాడు: చిన్మయి

Published on Tue, 09/17/2024 - 11:06

ప్రముఖ గాయని చిన్మయి తాజాగా టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌  జానీపై రియాక్ట్‌ అయ్యారు. చిత్రపరిశ్రమలో 'మీటూ' ఉద్యమం  సమయం నుంచే ఆమె అనేక అంశాలపై లేవనెత్తుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని మహిళలు లైంగిక దాడులకు గురైతే వెంటనే తన అభిప్రాయాన్ని తెలుపుతారు. డ్యాన్స్‌ మాస్టర్‌ జానీపై లైంగిక ఆరోపణలు చేసిన యువతి పక్షాన సింగర్‌ చిన్మయి నిలబడ్డారు.

ఒక మీడియా కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ చిన్మయి ఇలా చెప్పుకొచ్చారు. 'నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్‌ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను  కోరుకుంటున్నాను.' అని ఆమె తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని (అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌)  జానీ మాస్టర్‌ లైంగికంగా వేధించాడని  ఆరోపణలు వచ్చాయి. నార్సింగ్‌ పోలీస్టేషన్‌లో కేసు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే.

చిన్మయి ఒక సింగర్‌గానే కాదు... ఆమె ఒక ఫెమినిస్ట్‌గా కూడా గుర్తింపు పొందారు. గతంలో చిన్మయి కూడా లైగింక వేధింపులకు గరైనట్లు చెప్పిన విషయం తెలిసిందే. తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే  సాహిత్య రచయిత వైరముత్తు తన ఫోన్‌ నంబర్‌ తీసుకుని పలు ఇబ్బందులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. తాను నంబర్‌ మార్చినా కూడా ఎదో విధంగా తెలుసుకుని కాల్స్‌ చేసేవాడని ఆమె చెప్పారు. అలా ఆమె కూడా ఇలాంటి ఘటనలతో ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే ఆమె మహళలకు అండగా నిలుస్తూ ఉంటారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)