Breaking News

లిటిల్‌ స్టార్స్‌

Published on Sat, 11/14/2026 - 01:36

ఇప్పుడంతా స్టార్‌ హీరోల సినిమాలు, పాన్‌ ఇండిమా సినిమాల హవానే కనిపిస్తోంది. మార్కెటింగ్‌ పరంగా ఈ సినిమాలకు ఉండే వెసులుబాటు బాలల చిత్రాలకు ఉండదు. అందుకే ‘చిల్డ్రన్‌ మూవీస్‌’ సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. కానీ చిన్నారులే పెద్ద స్టార్స్‌గా ఉన్న కథలు ఈ ఏడాది మాత్రం కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు వచ్చాయి. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలూ ఉన్నాయి. 
నేడు బాలల దినోత్సవం సందర్భంగా లిటిల్‌ స్టార్స్‌ లీడ్‌ రోల్స్‌లో రానున్న సినిమాలపై కథనం.

మనసు చూడండి 
పరీక్షల్లో వచ్చే మార్కులే విద్యార్థుల జీవితాన్ని డిసైడ్‌ చేయవని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు... పిల్లల మనోభావాలను అర్థం చేసుకుని వారిలోని ఇతర నైపుణ్యాలను ప్రోత్సాహించాలనే కథతో రూపొందిన సినిమా ‘జయంత్‌ అండ్‌ ది జింగో పెన్‌’. ఈ చిత్రంలో మాస్టర్‌ జయంత్‌ బొలిశెట్టి లీడ్‌ రోల్‌లో నటించగా, ఊహారెడ్డి, ‘సత్యం’ రాజేశ్, తనికెళ్ల భరణి, ఆశిష్‌ గాంధీ కీలక పాత్రల్లో నటించారు.

నవీన్‌ దేశబోయిన దర్శకత్వంలో ఈ సినిమాను దివ్య ప్రవీణ్‌ బొలిశెట్టి నిర్మించగా, షఫి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం బాలల దినోత్సవం సందర్భంగా నేడు విడుదలైంది. ‘‘పిల్లలకు, పెద్దలకు, టీచర్లకు మంచి సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది.

పిల్లల మార్కులు కాదు... మనసులు చూడండి అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఈ మూవీని పిల్లలు చూడాలనే ఉద్దేశంతో టికెట్‌ ధరలను రూ. 250 నుంచి రూ. 150కి తగ్గించాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యేలా ఈ మూవీ ఉంటుంది’’ అన్నారు దివ్య ప్రవీణ్‌ బొలిశెట్టి. 

నాన్న కుట్టి 
విజయ్‌ ఆంటోని, బేబీ లిథన్య ప్రధాన పాత్రల్లో తండ్రి–కూతురు అనుబంధం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘నాన్న కుట్టి’. ము. మారన్‌ దర్శకత్వంలో మీరా విజయ్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇందులో విజయ్‌ ఆంటోని, బేబీ లిథన్య తండ్రీకూతుళ్లుగా నటించారు.

‘‘యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగ కథనం, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ‘నాన్న కుట్టి’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు ఎడిటర్, సంగీత దర్శకుడిగానూ విజయ్‌ ఆంటోని బాధ్యతలు నిర్వర్తించడం విశేషం.

లిటిల్‌ ఫ్రెండ్‌ 
తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన సినిమా ‘డాడ్స్‌ లిటిల్‌ ఫ్రెండ్‌’. రజత్‌ రాఘవ్, బేబీ పరిణీత ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. కాజల్, హాసినీ సుధీర్, మాస్టర్‌ బెంజాన్‌ ఆరుమళ్ల కీలక పాత్రల్లో నటించారు. శరత్‌ దర్శకత్వంలో దీపక్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్‌ తెలిపారు.

‘‘కుటుంబ విలువలు, తల్లిదండ్రులు–పిల్లల మధ్య ఉన్న అనుబంధాలు ఈ సినిమాలో మేజర్‌ హైలైట్స్‌గా ఉంటాయి’’ అని యూనిట్‌ పేర్కొంది. ఇక ఇటీవల ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయగా, ఇందులో బేబీ పరిణీత ‘ఐ యామ్‌ యాన్‌ ఇండిపెండెంట్‌ ఉమెన్‌’ అని పదే పదే చెప్పడం కనిపిస్తుంది.  
ఈ కోవలో మరికొన్ని బాలల చిత్రాలు ఉన్నాయి.

⇒ చైల్డ్‌ ఆర్టిస్ట్స్‌లకు యాక్టింగ్‌కు స్కోప్‌ ఉండే కథలకు దర్శక–నిర్మాతలు ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ ఏడాది రవితేజ ‘ఇరుముడి’, ‘సమ్మర్‌ హాలిడేస్‌’, తమిళంలో ‘బత్తా’, మలయాళంలో ‘బాలన్‌: ది బాయ్‌’ వంటి చిత్రాలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 

‘ఇరుముడి’లో మనెమ్మ పాత్రలో బేబీ నక్షత్ర నటించింది.    ‘సమ్మర్‌ హాలిడేస్‌’లో మాస్టర్స్‌ రోహన్, అరుణ్‌ దేవ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్‌ సేతుపతి ‘బత్తా’ చిత్రంలో శబరి పాత్రధారిగా మాస్టర్‌ సాయి పృథ్వీరాజ్, మరో కీలక పాత్ర అయిన తేనుగా సహశ్రీ నటించింది. ‘బాలన్‌: ది బాయ్‌’లో మాస్టర్‌ ఆదికేశ్‌న్‌ కేఆర్‌ టైటిల్‌ రోల్‌ చేశాడు.

⇒ బాలల చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుండటం శుభసూచకం. అందుకు ఓ తాజా ఉదాహరణ ‘35: చిన్న కథ కాదు’. ‘బాల రామాయణం’ (1997) తర్వాత ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకున్న రెండో తెలుగు సినిమా ఇది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అందించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ బాలల చిత్రంగా ‘35: చిన్న కథ కాదు’ అవార్డు గెలుచుకోగా, ఈ చిత్రంలో నటించిన అరుణ్‌దేవ్‌  పోతుల ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డును అందుకోవడం విశేషం.

ఇక భారతీయ బాలల చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభిస్తోంది. ఈ ఏడాది లండన్‌లో జరిగిన 79వ బిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో మణిపురీ సినిమా ‘బూంగ్‌’ బెస్ట్‌ చిల్డ్రన్‌ అండ్‌ ఫ్యామిలీ ఫిల్మ్‌గా అవార్డు సాధించింది. ఈ విభాగంలో భారతదేశం నుంచి బాఫ్టా అవార్డు గెలుచుకున్న తొలి బాలల చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో బాల నటుడు గుగున్‌ కిప్‌గెన్‌ టైటిల్‌ రోల్‌ చేశాడు.

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు