Breaking News

చిలకలూరిపేట, చుండూరు మారణకాండపై సినిమా.. టీజర్ విడుదల

Published on Sun, 03/09/2025 - 12:42

మ‌న స‌మాజంలో చ‌ట్టం అంద‌రికీ స‌మానంగా వ‌ర్తిస్తుందా.! ఇదే పాయింట్‌తో '23' అనే సినిమా రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ విడుదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంచలన ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారని టీజర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. గతంలో మల్లేశం, 8 ఏ.ఎం మెట్రో, వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్‌ రాచకొండ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. '23' సినిమాలో తేజ, తన్మయ, ఝాన్సీ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

23 సినిమా టీజ‌ర్‌లోని అంశాలు తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.  1991 సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జ‌రిగిన చుండూరు మారణకాండ ఘ‌ట‌న‌తో టీజర్‌ ‍ప్రారంభమవుతుంది. ఆపై 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో  హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో జ‌రిగిన కార్ బాంబు దాడి గురుంచి తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్‌తో '23' చిత్రంలో చూపించనున్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)