Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ?

Published on Sun, 02/16/2025 - 13:58

ఛావా(Chhaava )..ప్రస్తుతం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుంది. విక్కీ కౌశల్‌, రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో రిలీజై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక నటించి మెప్పించారు. దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం  రూ.31 కోట్లు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్(రూ.31 కోట్లు) సొంతం చేసుకున్న చిత్రంగా ఛావా నిలిచింది. అంతేకాదు విక్కీ కౌశల్‌ కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఛావా రికార్డుకెక్కింది. ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ సంపాదించుకోవడంతో ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారీ ధరకు ఓటీటీ రైట్స్‌
ఛావా చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ఉన్న డిమాండ్‌ దృష్టిలో పెట్టుకొని డిజిటల్‌ రైట్స్‌ని భారీ ధరకే కొనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌. యావరేజ్‌ టాక్‌ వస్తే నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకున్నారట. కానీ ఊహించని విధంగా భారీ హిట్‌ టాక్‌ రావడంతో ఓటీటీ రిలీజ్‌ని పోస్ట్‌పోన్‌ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. అంటే ఏప్రిల్‌ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

ఛావా కథేంటంటే..
ఛత్రపతి శివాజీ మరణం మరాఠా సామ్రాజ్యంపై మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్‌ ఖన్నా) కన్నేస్తాడు. వారిని ఎదుర్కొని తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతాడు శంభాజీ మహారాజ్‌(విక్కీ కౌశల్‌). ఈ విషయం ఔరంగజేబుకు తెలిసి తానే స్వయంగా సైన్యంతో యుద్ధానికి బయల్దేరుతాడు. శక్తిమంతమైన మొగల్‌ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ యుద్దంలో సంభాజీకి ఆయన సతీమణి మహారాణి ఏసుభాయి(రష్మిక) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు? చివరకు మొఘల్ అహంకారాన్ని  తన పోరాటంతో ఎలా అణచివేశాడు? అనేది ఈ సినిమా కథ.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)