Breaking News

'మంజుమ్మ‌ల్ బాయ్స్' నిర్మాతల మోసం.. చీటింగ్‌ కేసు నమోదు

Published on Thu, 04/25/2024 - 15:35

ఈ మధ్య కాలంలో సౌత్‌ ఇండియాలో బాగా వినిపించిన మ‌ల‌యాళం సినిమాల్లో 'మంజుమ్మ‌ల్ బాయ్స్' ఒక‌టి. రూ.20కోట్ల  బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.250 కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి సరికొత్త  రికార్డు క్రియేట్‌ చేసింది. తెలుగులో కూడా ఇదే పేరుతో మైత్రీ మూవీ మేక‌ర్స్‌ విడుదల చేశారు.

ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. అయితే, తాజాగా ఈ చిత్ర నిర్మాతలపై కేసు నమోదైంది.​ ఎర్నాకుళం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 'మంజుమ్మ‌ల్ బాయ్స్' నిర్మాతలైన  సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ, బాబు షాహిర్‌ల మీద చీటింగ్‌​ కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం ఆ నిర్మాతలు తనని మోసం చేశారంటూ సిరాజ్‌ వలియతార న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 'మంజుమ్మ‌ల్ బాయ్స్' సినిమా కోసం తాను రూ.7 కోట్లు పెట్టుబడిగా పెట్టానని సిరాజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో 40 శాతం వాటా తనకు ఇస్తామని చెప్పడంతోనే పెట్టుబడి పెట్టినట్లు సిరాజ్‌ చెబుతున్నాడు. సినిమా భారీ విజయం అందుకున్న తర్వాత తనకు టచ్‌లో లేకుండా పోయారని ఆయన వాపోయాడు. లాభాల సంగతి పక్కనపెడితే తాను పెట్టిన రూ. 7 కోట్ల మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన తెలిపాడు. పూర్తి విచారణ తర్వాత  'మంజుమ్మ‌ల్ బాయ్స్' నిర్మాతలపై కేసు నమోదు చేయాలని ఎర్నాకుళం కోర్టు ఆదేశించింది.

2006లో జరిగిన వాస్తవ సంఘటనలను బేస్‌ చేసుకుని 'మంజుమ్మ‌ల్ బాయ్స్' చిత్రాన్ని  చిదంబరం  తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్,శ్రీనాథ్ భాసి, గణపతి, ఖలీద్ రెహమాన్, జార్జ్ మ‌రియ‌న్ తదితరులు నటించిన ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ సినిమా ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు