Breaking News

మరోసారి డాన్‌గా కమల్‌ హాసన్‌ సోదరుడు.. 93 ఏళ్ల వయసులోనూ అదే జోష్‌

Published on Wed, 08/02/2023 - 14:42

నటుడు కమల్‌ హాసన్‌ సోదరుడు నటి సుహాసిని తండ్రి అయిన చారుహాసన్‌ ఇంతకుముందు పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ఈమధ్య దాదా 87 అనే చిత్రంలో డాన్‌గా ప్రధాన పాత్ర పోషించి అందరినీ విస్మయపరిచారు. చారు హాసన్‌ వయసు ప్రస్తుతం 93 ఏళ్లు ఈ వయసులోనూ ఆయన మరోసారి డాన్‌గా తెరపై కనిపించబోతున్నారు.

ఇంతకుముందు దాదా 87, పౌడర్‌ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన విజయ్‌ శ్రీ.జీ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం హర. కోయంబత్తూర్‌ ఎస్పీ మోహన్‌ రాజ్‌, జీ మీడియా జయ శ్రీ విజయ్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు మోహన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. విలన్‌ పాత్రల్లో సురేష్‌ మీనన్‌, నటి వనిత విజయ్‌ కుమార్‌ నటించగా, నటి కుష్బూ, యోగిబాబు, మొట్టై రాజేంద్రన్‌, సింగం పులి, దీప, మైమ్‌ గోపి, శ్యామ్స్‌, కౌశిక్‌ ,అనిత్రా నాయర్‌, సంతోష్‌ ప్రభాకర్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు.

ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ పాఠశాలల్లో చదువుకుంటున్నప్పటి నుంచే బాలికలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ వంటి విషయాలపై అవగాహన కలిగించాలనే కాన్సెప్ట్‌తో దీన్ని నిర్మించామన్నారు. ఇకపోతే నటుడు చారుహాసన్‌ ఈ చిత్రంలో ఒక మంచి డాన్‌ గా నటించినట్లు చెప్పారు. ఆయన ఒక సామాజిక బాధ్యత కలిగిన డాన్‌ పాత్రను పోషించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)