Breaking News

11 ఏళ్ల తర్వాత మెగా ఫోన్‌ పట్టిన 'అతడు' నటుడు

Published on Fri, 09/08/2023 - 15:35

సినీ ప్రముఖుల వారసులు ఎక్కువగా సినీ రంగంపైనే మక్కువ చూపుతుంటారు. ఆ విధంగా పలువురు హీరోల వారసులు హీరోలుగా పరిచయం కావడం చూస్తున్నాం. తాజాగా ప్రముఖ నటుడు చరణ్‌రాజ్‌ తన వారసుడిని కథానాయకుడిగా పరిచయం చేసే పనిలో ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు చరణ్‌రాజ్‌. ఈయనకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దేవ్‌ని కథానాయకుడిగా పరిచయం చేయాలని చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అది ఇప్పటికి కార్యరూపం దాల్చుతోంది. దేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలో సుస్మిత, ప్రియదర్శిని హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. చరణ్‌రాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన ఒక కీలకపాత్రను పోషిస్తున్నారు. మత్స్యకార యువకుడికి మార్వాడి యువతికి మధ్య జరిగే ప్రేమ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుందని సమాచారం.

కాగా చరణ్‌రాజ్‌ 1999లో దర్శకుడిగా అవతారమెత్తి అన్నన్‌ తంగచ్చి అనే చిత్రాన్ని రూపొందించారు. 2012లో యదార్థ ప్రేమకథ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. మళ్లీ ఇన్నాళ్లకు మెగాఫోన్‌ పట్టడం విశేషం. తన వారసుడ్ని కథానాయకుడిగా నిలబెట్టే ప్రయత్నమే ఈ చిత్రం అని భావించవచ్చు. దీనికి కుప్పన్‌ అని టైటిల్‌ నిర్ణయించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

చదవండి: బయటేమో అన్నం పడేశావ్‌.. హౌస్‌లో ఎంగిలి మెతుకులు తిన్నావ్‌.. వాటే ఓవర్‌ యాక్టింగ్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)