Breaking News

మీకంటే నేనెక్కువగా బాధపడుతున్నాను: ఎన్టీఆర్‌

Published on Mon, 09/23/2024 - 00:47

‘‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగకపోవడం  నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా బాధగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. ‘దేవర’ సినిమా గురించి చె΄్పాలని, ఈ సినిమా కోసం మేం పడ్డ కష్టాన్ని వివరించాలని చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. కానీ భద్రతా పరమైన కారణాల వల్ల ఈవెంట్‌ను క్యాన్సిల్‌ చేయడం జరిగింది. మళ్లీ చెబుతున్నాను. మీతో పాటు నేనూ బాధపడుతున్నాను. మీ కంటే నా బాధ చాలా పెద్దది... ఎక్కువ కూడా’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’. ‘జనతాగ్యారేజ్‌’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఇది.

ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్స్ గా నటించారు. కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘దేవర: పార్ట్‌ 1’ ఈ నెల 27న  తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌ నిర్వహించాలనుకున్న ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ భద్రతా కారణాల వల్ల రద్దు అయింది. ఈ నేపథ్యంలో అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి ఎన్టీఆర్‌ ఆదివారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మీరు నాపై కురిపించే ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను.

ఈవెంట్‌ క్యాన్సిల్‌ అయినందుకు ‘దేవర’ సినిమా నిర్మాతలను, ఈవెంట్‌ నిర్వాహకులను బ్లేమ్‌ చేయడం తప్పని నా భావన. కానీ ఈ రోజు మనం కలవకపోయినా సెప్టెంబరు 27న మనందరం కలవబోతున్నాం. ‘దేవర’ చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. నేను మీకు ఎప్పుడూ చెప్పినట్లే... మీరు కాలర్‌ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా బాధ్యత. దాంతో వచ్చే ఆనందాన్ని నా మాటల్లో చెప్పలేను. ఈ సెప్టెంబరు 27న అదే జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి. అందరూ ఆనందించండి.

మీ ఆశీర్వాదం ఈ ‘దేవర’కు చాలా అవసరం. నాకూ చాలా అవసరం. దయచేసి మీ అశీర్వాదాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను. ఇంకొక్కమాట.. మీరందరూ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్లాలని ఇంకొక్కసారి మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే...‘దేవర’ సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ను ఆదివారం ఉదయం రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్‌లో ‘దేవర అడిగినాడంటే సెప్పినాడని’ అనే డైలాగ్‌ ఒకటి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)