Breaking News

భారీ ధరకు చంద్రముఖి 2 ఓటీటీ రైట్స్‌.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా?

Published on Wed, 10/04/2023 - 13:23

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ జంటగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి 2. 2005లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన హార్రర్‌ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌ ఇది. పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ చంద్రముఖి స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజు నుంచే మిశ్రమ స్పందన రావడంతో.. కలెక్షన్స్‌ కూడా పెద్దగా రాలేదు. అయితే సినిమాకు వచ్చిన బజ్‌ చూసి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు డిజిటల్‌ రైట్స్‌ కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

స్ట్రీమింగ్‌ అప్పుడేనా..
చంద్రముఖి 2 స్ట్రీమింగ్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫిక్ల్‌ దక్కించుకుంది. దాదాపు రూ. 8 కోట్లు పెట్టి ఓటీటీ రైట్స్‌ కొనుగోలు చేసిందట. సినిమా విడుదలైన నెలన్నర తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయాలని తొలుత ఒప్పుందం కుదుర్చుకున్నారట. అయితె థియేటర్స్‌ ఆడియన్స్‌ నుంచి ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడంతో ముందుగానే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తోందట. నవంబర్‌ మూడో వారంలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుందని సమాచారం. అయితే దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

‘ఎమెర్జెన్సీ’ బిజీలో కంగనా
చం‍ద్రముఖి 2లో టైటిల్‌ రోల్‌లొ నటించిన కంగనా.. ఇప్పుడా పాత్ర నుంచి బయటకు వచ్చింది. సినిమా ఫలితాన్ని మర్చిపోయి.. రాబోతున్న సినిమాలపై దృష్టి పెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెనీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  ఇందిరా గాంధి బయోపిక్‌ ఇది. దీంతో పాటు ‘తేజస్‌’ చిత్రంలో కూడా కంగనా నటించింది. . 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సర్వేష్‌ మేవారా దర్శకత్వం వహిస్తు​న్న ఈ చిత్రం అక్టోబర్‌ 20న విడుదల కాబోతుంది. 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)