Breaking News

Chandramukhi 2: ఆసక్తి పెంచుతోన్న చంద్రముఖి-2 ట్రైలర్‌

Published on Sun, 09/03/2023 - 18:20

రాఘవ లారెన్స్ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రను పోషించింది. రజనీకాంత్‌ నటించిన సూపర్‌హిట్‌ సినిమా ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది.

‘రాజాధి రాజ.. రాజ గంభీర.. రాజ మార్తాండ.. రాజ కుల తిల‌క..వేటయ్య వేట్ట‌య రాజు వరాదూర్‌’అంటూ రాఘవ లారెన్స్‌ ఎంట్రీతో ట్రైలర్‌ ప్రారంభం అవుతంది. ట్రైల‌ర్‌లో రాఘవ లారెన్స్ రెండు షేడ్స్‌లో మెప్పిస్తున్నారు. ఒక‌టి స్టైలిష్ లుక్ కాగా.. మ‌రోటి వేట్ట‌యా రాజా లుక్‌. ఇక చంద్ర‌ముఖి పాత్ర‌లో కంగనా ర‌నౌత్ ఒదిగిపోయింది.

ఇక బ‌స‌వ‌య్య పాత్ర‌లో స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు త‌న‌దైన కామెడీతో మెప్పించ‌బోతున్నారు. సినిమాలోని హార‌ర్‌, థ్రిల్లింగ్, కామెడీ అంశాల‌ను చూపించారు. ప్ర‌తీ ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా తెర‌కెక్కించారు. న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌తో పాటు ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీతం, నేప‌థ్య సంగీతం, ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ హైలైట్‌గా ఆడియెన్స్‌ను అల‌రించ‌నున్నాయ‌ని ట్రైల‌ర్ చూస్తుంటే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ట్రైల‌ర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచుతోంది. ‘చంద్ర‌ముఖి 2’తో డైరెక్ట‌ర్ పి.వాసు సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ‌రోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయ‌బోతున్నారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)