Breaking News

కంగనా చాలా బోల్డ్‌.. గన్‌మెన్స్‌తో కలిసి సెట్‌లోకి.. భయపడ్డా: లారెన్స్‌

Published on Sat, 08/26/2023 - 19:18

‘చంద్రముఖి-2’లో కంగనా రనౌత్‌ హీరోయిన్‌ అని తెలియగానే ఆశ్చర్యపోయాను. ఆమె చాలా బోల్డ్‌ పర్సన్‌. సెట్స్‌లోకి గన్‌మెన్స్‌తో వచ్చేది. అప్పుడు నాలో ఇంకా భ‌యం పెరిగిపోయింది. త‌ర్వాత నా రిక్వెస్ట్ మేర‌కు ఆమె గ‌న్ మెన్స్‌ను సెట్ బ‌య‌టే ఉంచారు. అప్ప‌టి నుంచి ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయటం ప్రారంభించాను. అద్భుతంగా పాత్ర‌లో ఒదిగిపోయారు’అని స్టార్‌ కొరియోగ్రాఫర్‌, డెరెక్టర్‌, హీరో రాఘవ లారెన్స్‌ అన్నారు.

ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం  ‘చంద్రముఖి 2’. సీనియర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ..‘పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌గారు నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ చంద్ర‌ముఖి 2 వంటి ఓ గొప్ప సినిమాను లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు. ఆయ‌న బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌టం ఎంతో గ‌ర్వంగా ఉంది. ఇక మా డైరెక్ట‌ర్ వాసుగారి గురించి చెప్పాలంటే ఆయ‌న‌కు నాలుగు ద‌శాబ్దాల అనుభ‌వం ఉంది. నేను చిన్న సైడ్ డాన్స‌ర్‌గా ఉన్నప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న డైరెక్ట‌ర్‌గా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ‘చంద్రముఖి 2’ను కూడా ఎంతో గొప్ప‌గా తెర‌కెక్కించారు. ఈ సినిమా సాధించే విజ‌యం ఆయ‌న‌కే ద‌క్కుతుంది’ అన్నారు. 

హీరోయిన్‌ కంగనా రనౌత్‌ మాట్లాడుతూ..‘నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్ల‌లో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేయలేదు. అసలు విష‌య‌మేమంటే.. నాకు అవకాశం కావాల‌ని ఎవ‌రినీ అడ‌గ‌లేదు. తొలిసారి డైరెక్ట‌ర్ పి.వాసుగారినే అడిగాను. ఈ సినిమాలో వాసుగారు నా పాత్ర‌తో పాటు ప్ర‌తీ పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయ‌న‌కే ద‌క్కుతుంది. లారెన్స్ మాస్ట‌ర్ చాలా మందికి పెద్ద ఇన్‌స్పిరేష‌న్‌. ఆయ‌న చిన్న డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరో, ద‌ర్శ‌కుడు రేంజ్‌కు ఎదిగారు. ఎంతో మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా చిరున‌వ్వుతో స్వీక‌రిస్తారు. అలాంటి గుణం చాలాత‌క్కువ మందికే ఉంటుంది.రు. కీర‌వాణిగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. ప్ర‌పంచమంతా ఆయన గురించి గొప్ప‌గా మాట్లాడింది.

ఆయ‌న‌కు ఆస్కార్ అవార్డ్ వ‌స్తే నాకే వ‌చ్చిన‌ట్లు సంతోష‌ప‌డ్డాను. ఆయ‌న మ్యూజిక్ డైరెక్ష‌న్‌లో సినిమా చేయ‌టం ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్‌’అని అన్నారు. ‘డైరెక్ట‌ర్‌గా ఇప్ప‌టి ద‌ర్శ‌కుల‌తో పోటీ ప‌డాల‌నే ఆలోచిస్తుంటాను. ఆ కోణంలో ఆలోచించే చంద్ర‌ముఖి 2ను రూపొందించాను. ఈ చిత్రాన్ని  లారెన్స్‌తో చేస్తున్నామ‌ని ర‌జనీకాంత్‌గారికి చెప్ప‌గానే సినిమా గొప్ప విజ‌యాన్ని సాధిస్తుంద‌న్నారు. లారెన్స్‌ చాలా అద్భుతంగా నటించాడు’అని దర్శకుడు పి.వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్‌ విన్నర్‌ ఎంఎం కీరవాణి, కమెడియన్‌ వడివేలుతో పాటు ఇతర చిత్రబృందం అంతా పాల్గొని, పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)