Breaking News

మెగాస్టార్‌ కంటే చంద్రమోహన్‌కు ఎక్కువ రెమ్యునరేషన్‌.. ఏ సినిమాలో అంటే?

Published on Sun, 11/12/2023 - 13:31

ప్రముఖ నటుడు, సినీ ఆల్‌రౌండర్‌ చంద్రమోహన్‌ శుక్రవారం(నవంబర్‌ 11న) మరణించారు. ఆయన మరణంతో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్‌ ఇచ్చిన ఈయన కెరీర్‌ తొలినాళ్లలో హీరోగా రాణించారు. తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారి విభిన్న రకాల పాత్రలు పోషించి వాటికి ప్రాణం పోశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తోనే కాకుండా తర్వాతి జనరేషన్‌ అయిన చిరంజీవి, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌, మహేశ్‌బాబు ఇలా అందరు స్టార్‌ హీరోలతోనూ నటించారు. అయితే ఓ సినిమాలో చిరంజీవి కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'చిరంజీవి, నేను తొలిసారి 'ప్రాణం ఖరీదు' చిత్రంలో కలిసి నటించాం. అప్పుడు ఆయనకు ఐదు వేలు పారితోషికం ఇస్తే నాకు రూ.25 వేలు ఇచ్చారు. అప్పట్లో చిరు రఫ్‌గా ఉండేవారు. కానీ తనలో తపన, సిన్సియారిటీ ఉంది. చిరంజీవిని చూసి ఇండస్ట్రీలో ఒక మంచి డ్యాన్సర్‌ వచ్చారనుకున్నారంతా! చిరంజీవి విజయానికి ప్రధాన కారణం అల్లు అరవింద్‌. చిరంజీవి ఏ పాత్రలు చేయాలి? ఎంత రెమ్యునరేషన్‌ తీసుకోవాలి? వంటి చాలా విషయాలను ఆయన దగ్గరుండి చెప్తూ తన కెరీర్‌కు దిక్సూచిలా నిలబడ్డారు' అని చంద్రమోహన్‌ చెప్పుకొచ్చారు.

చదవండి: 900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు
 ఇతరులకు ‘మాస్‌’.. శివాజీకి ‘క్లాస్‌’.. ఇదేం పద్దతి బాసూ..?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)