Breaking News

హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్‌ అయిపోతారు!

Published on Sat, 11/11/2023 - 11:28

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ఆరంభించి.. హీరోగా పదుల సంఖ్యలో సినిమాలు తీసి మెప్పించిన సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌. హీరో, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌..ఇలా ఏ పాత్రలో​ అయినే ఒదిగిపోయే దిగ్గజ నటుడాయన. 55 ఏళ్ల తన సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. 

(చదవండి: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత)

♦ఇప్పటి తరానికి చంద్రమోహన్‌ అంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే తెలుసు కానీ.. ఒకప్పుడు ఆయన స్టార్‌ హీరో. ఆయనతో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. అతన్ని నిర్మాత హీరో అనేవాళ్లు. ఎందుకంటే ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువశాతం విజయవంతం అయినవే. అందుకే నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. ఒకే ఏడాదిలో మూడు నాలుగు సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. 

♦ చంద్రమోహన్‌పై ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్‌ కూడా ఉంది. ఆయన్ను హీరోయిన్లకు లక్కీ హ్యాండ్‌ అనేవాళ్లు. ఎందుకంటే ఆయనతో కలిసి నటిస్తే చాలు.. ఆ హీరోయిన్‌ స్టార్‌ అయిపోతుంది.  అందుకే చాలా మంది హీరోయిన్లు చంద్రమోహన్‌తో నటించేందుకు ఆసక్తి చూపించేవాళ్లు. 

♦ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్‌ హీరో. జయప్రద హీరోయిన్‌. అప్పటి వరకు జయప్రదకు గుర్తింపు లేదు. కానీ ఆ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

♦దివంగత నటి శ్రీదేవి తొలి హీరో కూడా చంద్రమోహన్‌గారు. ‘పదహారేళ్ల వయసు’చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ చిత్రం తర్వాత శ్రీదేవి స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. 

ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో చేదు ‍అనుభవం.. కానీ మంచే జరిగింది

♦ జయసుధకు కూడా చంద్రమోహన్‌ సినిమాతోనే స్టార్‌డమ్‌ వచ్చింది. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో పాటు జయసుధకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి భళే కాపురం, స్వర్గం, శ్రీమతి ఒక బహుమతి తదితర చిత్రాల్లో నటించారు. 

♦ లేడి మెగాస్టార్‌ విజయశాంతి సైతం...చంద్రమోహన్‌తో నటించిన తర్వాతే స్టార్‌గా ఎదిగింది. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్ విజయశాంతి కలిసి నటించారు. ఆ తర్వాత విజయశాంతికి వరుసగా అవకాశాలు లభించాయి. వీరిద్దరు కాంబోలో వచ్చిన ‘ప్రతి ఘటన’ బ్లాక్‌ బస్టర్‌ హిట్టయింది. ఇలా చాలామంది హీరోయిన్లను స్టార్స్‌ చేస్తూ..‘లక్కీ హ్యాండ్‌’గా పేరు సంపాదించుకున్నాడు. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)