కావాలనే గ్యాప్‌ తీసుకున్నా..

Published on Mon, 12/22/2025 - 09:33

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా, ఒక మంచి అనుభూతిని పంచే చిత్రంగా చాంపియన్‌ చిత్రం నిలుస్తుందని హీరో రోషన్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వంలో అనస్వర రాజన్‌ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఆదివారం రాత్రి బీచ్‌ రోడ్డులో గ్రాండ్‌గా మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రోషన్‌ మాట్లాడుతూ నటనలో పరిణతి సాధించేందుకే ‘పెళ్లి సందడి’ తర్వాత కావాలనే విరామం తీసుకున్నానని తెలిపారు. 

1948 నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ వార్‌ డ్రామాలో తాను ఫుట్‌బాల్‌ ఆటగాడిగా కనిపిస్తానని, తనను తాను కొత్తగా మలుచుకున్నానని పేర్కొన్నారు. పీటర్‌ హెయిన్‌ మాస్టర్‌ పర్యవేక్షణలో అద్భుతమైన పోరాట ఘట్టాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వివరించారు. కథానాయిక అనస్వర రాజన్‌ మాట్లాడుతూ వైజాగ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ సినిమా పక్కా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత జెమిని కిరణ్‌ మాట్లాడుతూ చిత్రంలోని ‘గిర గిరా’ సాంగ్‌ ఇప్పటికే సూపర్‌ హిట్‌ అయిందని, సినిమా కూడా అందరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నటి ఊహతో పాటు చిత్ర బృందం పాల్గొంది.   

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)