Breaking News

హృదయం ముక్కలయ్యాక మిగిలేది అదే!: నిహారిక మాజీ భర్త పోస్ట్‌

Published on Sat, 03/16/2024 - 17:01

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధాన్ని కాపాడుకోలేకపోయారు. పెళ్లయిన మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు. విడాకుల గురించి చాలాకాలం మౌనంగా ఉన్న నిహారిక ఇటీవలే కాస్త ఓపెన్‌ అయింది. ఓ పాడ్‌కాస్ట్‌లో.. పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని.. అందరూ కన్నతల్లిదండ్రుల్లా ప్రేమగా మెదలరని చైతన్య గురించి చెప్పకనే చెప్పింది.

మూడేళ్లకే విడాకులు
పెళ్లి- విడాకుల వ్యవహారం ద్వారా ఎవరినీ నమ్మకూడదని తెలిసొచ్చిందని, ఇదొక గుణపాఠమని వ్యాఖ్యానించింది. దీనిపై చైతన్య జొన్నలగడ్డ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యాడు. పెళ్లి పెటాకులైతే ఆ బాధ ఇద్దరికీ ఉంటుంది.. దానినుంచి బయటపడటం కూడా రెండువైపులా ఒకేలా ఉంటుంది. ఒకరి వర్షనే మాట్లాడి దాన్ని హైలెట్‌ చేయడం గొప్ప కాదని విమర్శించాడు. తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. నిశ్శబ్దం ఎంత పదునైందో వివరిస్తూ ఓ లేఖ పంచుకున్నాడు.

జీవితం ఎటు పోతోందో..
'విశాల అంతరిక్షంలో నిశ్శబ్దం.. నీటి అడుగున ఉన్నప్పుడు అదే నిశ్శబ్దం.. చల్లని శీతకాలపు రాత్రుల్లో ఆవరించే నిశ్శబ్దం.. షో ముగియగానే చప్పట్లు కొట్టేముందు వచ్చే నిశ్శబ్దం.. మీ మనసును ముక్కలు చేసే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం.. జీవితం ఎటు పోతోందో అర్థం కాని ఆలోచనల్లో అలుముకునే నిశ్శబ్దం.. ఈ సైలెన్స్‌ ప్రాణ శక్తి నుంచి ప్రకృతి శక్తిని దూరం చేస్తుందా..! భౌతిక రూపం నుంచి విముక్తి పొందండి.. అప్పుడు భగవంతుడితో మనల్ని కలిపే మాధ్యమే ఈ సైలెన్స్‌ అని మీరు తప్పక గుర్తిస్తారు' అని రాసుకొచ్చాడు. నిశ్శబ్దమే అన్నింటికంటే అతిపెద్ద ఆయుధమని పరోక్షంగా చెప్తున్నాడు.

చదవండి: ఇంత దారుణమైన ట్రోలింగ్‌ ఎప్పుడూ చూడలేదు.. నటి ఎమోషనల్‌

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)