Breaking News

సమంతతో విడాకులు.. అలాంటి కామెంట్లు ఇకనైనా ఆపేయండి: నాగచైతన్య

Published on Sat, 02/08/2025 - 08:45

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య తన మాజీ భాగస్వామి  సమంత గురించి మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. వారు వివాహబంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్‌ అయిన విషయం తెలిసిందే. కానీ, నాగచైతన్య ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆయన రియాక్ట్‌ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగటివ్‌ కామెంట్లు వచ్చాయని ఆయన అన్నారు. తను, నేను ఇద్దరం ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ చాలామంది నెగటివ్‌ కామెంట్లు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో శోభితతో పెళ్లి గురించి కూడా ఆయన పంచుకున్నారు.  

'సమంతతో విడాకుల తర్వాత సోషల్‌మీడియాలో ఎలాంటి పోస్ట్‌ షేర్‌ చేసినా కూడా నెగటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. అవి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని నేనూ చదవుతాను. సమంతతో విడిపోయిన తర్వాత ఇద్దరం కలిసే విడాకుల విషయాన్ని ప్రపంచానికి చెప్పాం. వ్యక్తిగత కారణాల వల్ల వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించాం. ఎవరిదారిలో వారి జర్నీ కొనసాగుతుందని తెలిపాం. మా వ్యక్తిగత జీవితం విషయంలో కాస్త ప్రైవసీ ఇవ్వండి అంటూ అభ్యర్థించాము కూడా.. అయితే, మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. ఎన్నో గాసిప్స్‌ వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలో మళ్లీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.. ఆ ఇంటర్వ్యూ నుంచి కూడా మరికొన్ని వార్తలు ప్రసారం అవుతాయి. అందుకే స్పందించలేదు. 

కానీ, కొన్ని సందర్భాల్లో పలు వేదికలపై ఈ విషయం గురించి అడిగారు. ఆ సమయంలో ఈ టాపిక్‌ గురించి వదిలేయండి అని కూడా రిక్వెస్ట్ చేశాను. అయినప్పటికీ అదే విషయంపై ప్రశ్నలు అడుగుతూ.. మళ్లీ ఆ గాయాన్ని గెలుకుతున్నారు. కానీ, మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించలేదు. మా విడాకుల వార్తలు, కామెంట్ల గురించి ఎవరూ ఫుల్‌ స్టాప్‌ పెట్టడం లేదు. అలాంటి వార్తలు రాసే వారు ఇకనైన ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. నా మీద నెగటివ్‌ కామెంట్లు చేసే వారు ఇకనైనా ఆపేయండి.. మీ భవిష్యత్‌ గురించి మంచిగా ఆలోచించండి. 

విడాకులు అనేది నా జీవితంలో మాత్రమే జరగలేదు. సమాజంలో చాలామంది లైఫ్‌లో జరిగాయి. నేనేమైనా క్రిమినల్‌ను కాదు కదా..   నేను ఒక బ్రోకెన్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాను. వెయ్యి సార్లు ఆలోచించే విడాకులు తీసుకున్నాం. మా జీవితంలో విడాకులు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు.. చాలారోజుల పాటు చర్చించిన తర్వాతే ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన అన్నారు.

నా లైఫ్‌లో నిజమైన హీరో ఆమె..
నటి శోభితాతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగటివ్‌గానే కామెంట్లు చేశారని చైతన్య అన్నారు. 'ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్‌గానే ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానే పరిచయం అయింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. కానీ, తన గురించి బ్యాడ్‌గా మాట్లాడటం చాలా తప్పు. నా పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆమె చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది. నా జీవితంలో నిజమైన హీరో శోభితానే..' అంటూ పేర్కొన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)