Breaking News

చాయ్‌వాలా ప్రేమకథ

Published on Thu, 08/21/2025 - 00:05

‘‘చాయ్‌వాలా’ సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా తమ తండ్రితో కాసేపు మాట్లాడతారు. ఈ చిత్రం చూశాక థియేటర్‌ నుంచి ఓ మంచి భావోద్వేగంతో బయటికొస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని శివ కందుకూరి తెలి పారు. ప్రమోద్‌ హర్ష రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చాయ్‌వాలా’. శివ కందుకూరి, తేజు అశ్విని జోడీగా నటించారు. రాధా విజయలక్ష్మి, వెంకట్‌ ఆర్‌. పాపుడిప్పు నిర్మించారు. బుధవారం జరిగిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ ప్రయాణంలో నాకు  ప్రమోద్‌ మంచి స్నేహితుడిగా మారిపోయారు.

నిర్మాత వెంకట్‌గారికి సినిమా పట్ల ఎంతో  ఫ్యాషన్‌ ఉంది. మా చిత్రం ప్రేక్షకులందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చె΄్పారు. ‘‘చాయ్‌వాలా’ ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్‌ అవుతుంది’’ అని నిర్మాత రాజ్‌ కందుకూరి అన్నారు. ప్రమోద్‌ హర్ష మాట్లాడుతూ– ‘‘నేను రాసుకున్న పాత్రలు, కథ నుంచే ‘చాయ్‌వాలా’ టైటిల్‌ను తీసుకున్నాను. ప్రతి మనిషి జీవితంలో జరిగే ఘటనలే మా చిత్రంలో ఉంటాయి’’ అని చెప్పారు.

‘‘మా సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. ఇదొక సున్నితమైన ప్రేమకథ’’ అని వెంకట్‌ ఆర్‌. పాపుడిప్పు పేర్కొన్నారు. ‘‘తెలుగులో ‘చాయ్‌వాలా’ నా మొదటి చిత్రం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు తేజు అశ్విని. ‘‘ఈ కథ వినోదాత్మకంగా, అలాగే భావోద్వేగంగా ఉంటుంది. మా ‘చాయ్‌వాలా’ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని నటుడు రాజీవ్‌ కనకాల తెలి పారు. నటుడు రాజ్‌కుమార్‌ కసిరెడ్డి మాట్లాడారు. 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)