Breaking News

సెన్సార్‌ బోర్డుకు లంచం.. అధికారుల ముందు హాజరైన విశాల్‌ కార్యదర్శి

Published on Sat, 10/21/2023 - 14:39

హీరో విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం మార్క్‌ ఆంటోని. ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేశారు. రిలీజ్‌కు ముందు మార్క్‌ ఆంటోని చిత్ర హిందీ వెర్షన్‌ను సెన్సార్‌ బోర్డుకు పంపగా అక్కడ సెన్సార్‌ సభ్యులు సర్టిఫికెట్‌ కావాలంటే రూ.6.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం సంచలనం సృష్టించింది. వారు అడిగినట్లుగానే విశాల్‌ డబ్బులు చెల్లించి సర్టిఫికెట్‌ తీసుకున్నారు. ఆ తర్వాత సెన్సార్‌ బోర్డు సభ్యులకు బ్యాంకు ద్వారా లంచం ఇచ్చినట్లు, దానికి సంబంధించిన బ్యాంక్‌ చలానా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. 

ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదుపై మహారాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని ముంబయి సీబీసీఐడీని కోరింది. సీబీసీఐడీ విచారణలో ముంబయి సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో వారిని సస్పెండ్‌ చేశారు.

సెన్సార్‌ సభ్యులకు లంచం ఇచ్చిన విశాల్‌ కార్యదర్శి హరికుమార్‌ను సీబీసీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. దీంతో హరికుమార్‌ శుక్రవారం అధికారుల ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. మరో విషయం ఏమిటంటే విశాల్‌ ఫిర్యాదు కారణంగా ఇప్పుడు తమిళం, తెలుగు సహా ప్రాంతీయ భాషల హిందీ అనువాద చిత్రాలకు చైన్నెలోనే సెన్సార్‌ సర్టిఫికెట్‌ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

చదవండి: ఆ వ్యాధుల వల్ల ఏ పనీ చేయలేకపోతున్నా.. ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు