Breaking News

‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ప్రశంసలు.. హీరోయిన్‌కి బెదిరింపులు!

Published on Sat, 05/10/2025 - 10:42

భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor )ని ప్రశంసిస్తూ పోస్ట్‌ పెట్టినందుకు హీరోయిన్‌ సెలీనా జైట్లీ(Celina Jaitly )కి బెదిరింపులు వచ్చాయి. భారత్‌ని ప్రశంసిస్తే అన్‌ఫాలో చేస్తామంటూ కొంతమంది నెటిజన్లు ఆమెను బెదిరించారు. అలాగే ఆమెను ట్రోల్స్‌ చేయడం ప్రారంభించారు. తాజాగా సెలినా ఈ ట్రోల్స్‌,బెదిరింపులపై స్పందించారు. ఉగ్రవాదానికి తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని.. నచ్చని వాళ్లు తనను అన్‌ఫాలో చేసుకోవచ్చని చెప్పారు. 

‘నా దేశం(భారత్‌) గురించి మాట్లాడితే అన్‌ఫాలో చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. వారందరిని నేను ఒకటే చెబుతున్నా.. క్షమాపణలు చేప్పే ప్రసక్తే లేదు. నా దేశం కోసం నేను నిలబడాతాను. ఉగ్రవారదం పేరుతో అమాయకులను బలి తీసుకుంటే స్పందించకుండా మౌనంగా ఉండలేను. హింసను ప్రోత్సహించే వారివైపు నేను ఉండను. భారత్‌పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధపెడితే నన్ను అన్‌ఫాలో చేయండి. నేను శాంతి కోసం, సత్యం కోసం నిలబడతాను. నా దేశ సైనికుల వెంటే నేనుంటాను. నా దేశ సైనికులు కులం, మతం అడగకుండా మమ్మల్ని రక్షిస్తున్నారు. మీ ట్రోల్స్‌ని గమనిస్తున్నాను. ఇలాంటి వారిని క్షమించను. జైహింద్‌’అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న సెలీనా జైట్లీ.. ఆపరేషన్‌ సిందూర్‌ని ప్రారంభించినప్పుడు మన దేశాన్ని ప్రశంసిస్తూ పోస్ట్‌ చేశారు. తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ..మనసంతా భారత్‌ గురించే ఆలోచిస్తుందని, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న పోరాటాలను, త్యాగాలను మరిచిపోలేమని ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. దీనిపై కొంతమంది నెటిజన్స్‌ నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తూ ఆమెను ట్రోల్‌ చేయడంపై పైవిధంగా స్పదించింది.

మిస్‌ యూనివర్స్‌ 2003 రన్నరప్‌గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్‌ పీటర్‌ను పెళ్లాడింది. వీరికి 13 ఏళ్ల కవలలు విన్‌స్టన్‌, విరాజ్‌తో పాటు ఏడేళ్ల ఆర్థూర్‌ సంతానం. ఇకపోతే మోడల్‌గా సత్తా చాటిన సెలీనా 2003లో 'జనాషీన్‌' సినిమాతో వెండితెరపై తన లక్‌ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్‌మాల్‌ రిటర్న్స్‌ సినిమాల్లో మెరిసింది.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి